Pawan Kalyan: పవన్ – రానా నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమాకి సంబంధించి సగం షూటింగ్ కంప్లీట్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా సినిమాకి పవన్ కళ్యాణ్- రానా మధ్య సంభాషణలకు త్రివిక్రమ్ తన పెన్ పవర్ కి బాగా పదును పెట్టి డైలాగులు రాయడం జరిగిందట. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్.. ఇండస్ట్రీలో తన ఫ్యామిలీతో కాకుండా ఓ పెద్ద హీరోతో మల్టీస్టారర్ సినిమా చేస్తూ ఉండటంతో ఈ రీమేక్ సినిమా ప్రేక్షకులకు అంచనాలు ఉన్నాయి.
రెండు క్యారెక్టర్ ల మధ్య సన్నివేశాలు నువ్వానేనా అన్నట్టుగా సిల్వర్ స్క్రీన్ పై ఉంటాయని సినిమా యూనిట్ చెబుతోంది. ఇదే తరుణంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా… ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని తెలిపారు. ఇదిలా ఉంటే మిగతా బ్యాలెన్స్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ చేయాలని పవన్ కళ్యాణ్ ఎప్పటికీ సినిమా యూనిట్ కి ఆదేశాలివ్వడం మనకు తెలిసిందే. పరిస్థితి ఇలా ఉండగా చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని అదే సరైన టైమింగ్ అని నిర్మాతలు భావించడం జరిగిందట.
Read More: Pawan Kalyan: హరీష్ శంకర్ సినిమా గురించి పవన్ అభిమానులకు గుడ్ న్యూస్..!!
అప్పటికి చాలా వరకు వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దీంతో ప్రజల లో కరోనా భయం పోయే పరిస్థితి ఉన్న నేపథ్యంలో… అదేరీతిలో టాలీవుడ్ ఇండస్ట్రీలో సంక్రాంతి పెద్ద బిజినెస్ సీజన్. ఈ నేపథ్యంలో పవన్ – రానా మల్టీస్టారర్ జనవరి రెండవ వారంలో సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.