Ustaad Bhagat Singh: హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమా తెరకెక్కుతోంది. ఎప్పటినుంచో ఈ కాంబినేషన్ కోసం పవన్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి హరీష్ శంకర్ వీరాభిమాని. పైగా పవన్ సినిమా కోసం దాదాపు మూడు సంవత్సరాలకు వెయిట్ చేసి పైగా ఏ సినిమా చేయకుండా ఈ సబ్జెక్టు పైనే ఫోకస్ పెట్టడం జరిగింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన “గబ్బర్ సింగ్” టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు క్రియేట్ చేసింది.
ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ చేసిన కామెడీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దాదాపు పది సంవత్సరాలకు పైగా వరుస పరాజయాలు చూసిన పవన్ కి ఆ టైములో “గబ్బర్ సింగ్” సినిమాతో దాదాపు ఇండస్ట్రీ హిట్ అందుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే “ఉస్తాద్ భగత్ సింగ్”.. మాత్రం ఈసారి ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు అంటూ.. హరీష్ క్లారిటీ ఇచ్చారు. అయితే “ఉస్తాద్ భగత్ సింగ్”లో పవన్ కళ్యాణ్ లెక్చరర్ పాత్రలో కనిపించబోతున్నట్లు సినిమా స్టార్ట్ అవ్వక ముందు అనేక వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఈ సినిమా నిర్మిస్తున్న సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో… పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.
ఈరోజే సినిమా షూటింగ్ స్టార్ట్ కావడంతో పోలీస్ స్టేషన్ లో కుర్చీలో పవన్ పోలీస్ డ్రెస్ లో కూర్చుని ఒక చేతిలో గన్ మరో చేతిలో టీ గ్లాసు పట్టుకుని ఉన్న పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ స్టిల్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అచ్చం “గబ్బర్ సింగ్” మాదిరిగానే “ఉస్తాద్ భగత్ సింగ్” లో పవన్ స్టీల్ ఉన్నట్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. కుర్ర హీరోయిన్ శ్రీ లీల కూడా కీలకపాత్రలో కనిపిస్తున్నట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్ సోషల్ మీడియా అకౌంట్ లో పోలీస్ డ్రెస్ లో పవన్ ఫోటో రిలీజ్ చేసి..ఉస్తాద్ ఊచకోత షురూ అనే ట్యాగ్ లైన్ పైన రాయటంతో సినిమాపై ఫ్యాన్స్ అంచనాలు భారీగా పెట్టేసుకుంటున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!