అబ్బాయి కోసం వస్తున్న బాబాయ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ స్పీడ్ పెంచాడు. ఇప్పటి వరకూ వినయ విధేయ రామ షూటింగ్ లో బిజీగా ఉన్న చెర్రీ, మూవీ షూటింగ్ అయిపోవడంతో ప్రొమోషన్స్ పై ద్రుష్టిపెట్టాడు. సంక్రాంతికి భారీ ఓపెనింగ్స్ రాబట్టాలి అంటే ప్రొమోషన్స్ అదిరిపోయేలా జరగాలని భావించిన బోయపాటి-చరణ్ లు వరసగా పోస్టర్స్ రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నారు. ఇప్పటి వరకూ టీజర్ తోనే మెప్పించిన ఈ ఇద్దరు సినిమాకి కొత్త ఊపు తీసుకురావాలంటే డిసెంబర్ 27న సాయంత్రం 6గంటలకి పోలీస్ గ్రౌండ్స్ లో జరగబోయే ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఛీఫ్ గెస్ట్ గా పిలవలనుకుంటున్నారట. వీలైతే పవన్ కళ్యాణ్ కి వినయ విధేయ రామ రష్ చూపించి సినిమా గురించి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇప్పిస్తే ఇప్పటికే ఉన్న హైప్ కి మరిన్ని అంచనాలు తోడవుతాయి. మెగా ఫ్యామిలీ నుంచి మెగా స్టార్ చిరంజీవి, వరుణ్ తేజ్ రాబోయే ఈ గ్రాండ్ ఈవెంట్ కి బాబాయ్ పవన్ కళ్యాణ్ కూడా తోడైతే బాగుంటుందని భావించిన చరణ్, పవన్ ని సంప్రదించగా ఆయన వస్తానని మాటిచ్చినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. అదే జరిగితే చిరుని, పవన్ ని ఒకేవేదిక పై చూడడానికి వచ్చే మెగా అభిమానుల సంతోషానికి హద్దులు ఉండవు. గతంలో రంగస్థలం సక్సస్ మీట్ కి బాబాయ్-అబ్బాయిలని ఒకే వేదికపై చూసిన మెగా ఫ్యాన్స్ విజిల్స్ తో రచ్చ చేశారు, అలాంటిది ఇప్పుడీ ఇద్దరికి చిరూ కూడా కలిస్తే పోలీస్ గ్రౌండ్స్ లో మెగా అభిమానులు చేయబోయే సందడి ఏ రేంజులో ఉంటుందో ఊహించుకోవచ్చు. అలాగే ఇదే వేదికపై పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా వినయ్ విధేయ రామ సినిమా ట్రైలర్ లాంచ్ చేయించాలని చరణ్ ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే కట్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ లో మాస్ ని ఆకట్టుకునే యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు, ఫ్యాన్స్ తో విజిల్స్ వేయించే డైలాగులు, క్లాస్ కి నచ్చే ఫ్యామిలీ సీన్స్ కూడా ఉంటాయట.. ఇదంతా చూస్తూనే చరణ్-బోయపాటి కలిసి సంక్రాంతికి అందరికీ నచ్చే, అందరూ మెచ్చే సినిమానే ప్రేక్షకుల ముందుకి తెస్తున్నారన్నమాట. మరి కొత్త ఏడాదిలో మెగా ఫ్యాన్స్ కి చరణ్ ఎలాంటి గిఫ్ట్ ఇస్తాడో చూడాలి