Pawan Kalyan: న్యాచురల్ స్టార్ నాని తాజా చిత్రం `అంటే.. సుందరానికీ!`. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రీయా నజీమ్ హీరోయిన్గా నటించింది. సీనియర్ నటుడు నరేష్, రోహిణి, నదియా, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ ముఖ్య పాత్రలు పోషించారు.
ఇందులో బ్రాహ్మణ యువకుడు సుందర్ ప్రసాద్ గా నాని, క్రిస్టియన్ యువతి లీలా థామస్ గా నజ్రియా నజీమ్ లు నటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మించిన ఈ లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్.. జూన్ 10న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ.. సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. అయితే ఈ సుందరుడి కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం రంగంలోకి దిగబోతున్నారు. అసలు విషయం ఏంటంటే.. `అంటే.. సుందరానికీ!` ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా పవన్ రాబోతున్నారు.
ఈ విషయాన్ని నాని తాజాగా కన్ఫామ్ చేశారు. వాస్తవానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 8న తొలిత ఫిక్స్ చేశారు. కానీ, పవన్ పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వస్తున్న నేపథ్యంలో జూన్ 9కి డేట్‌ను మార్చారు. శిల్పాకళా వేదికలో గురువారం(జూన్ 9న) `అంటే.. సుందరానికీ!` ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. ఏదేమైనా గెస్ట్‌గా పవన్ వస్తే సినిమాకు మంచి బజ్ క్రియేట్ అవుతుంది. అదే సమయంలో ఈ ఈవెంట్ ఫ్యాన్స్‌కు కన్నుల పండగగా మారుతుంది.