BRO: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సాయి ధరంతేజ్ కలసి నటించిన “బ్రో” సినిమా ఈనెల 28వ తారీకు విడుదల కాబోతోంది. ఫస్ట్ టైం.. మెగా హీరోతో పవన్ కలిసి మల్టీ స్టారర్ చేయడంతో ఈ సినిమాపై మెగా అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. “వినోదయ సీతం” సినిమాకే రీమేక్ గా “BRO” తెరకెక్కటం జరిగింది. జి స్టూడియోస్ తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాని సముద్రఖని డైరెక్షన్ చేయడం జరిగింది. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. జులై 28వ తారీకు విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన పవర్ స్టార్స్ మరియు ప్రోమోలు టీజర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది.
ఇంకా ఇదే సమయంలో మొదటి పాట “మై డియర్ మార్కండేయ” కొద్ది రోజుల క్రితం విడుదలయ్యి అద్భుతమైన ఆదరణ దక్కించుకుంది. ఈ క్రమంలో శనివారం రెండవ పాట “జాణవులే” సాంగ్ రిలీజ్ అయింది. తమన్ సంగీతం అందించడం జరిగింది. ఈ పాటను ప్రణతితో కలిసి తమన్ వాడటం జరిగింది. కాసర్ల శ్యాం సాహిత్యం వహించారు. “జాణవులే నెరజాణవులే…నా జాన్ నువ్వులే జాణవులే…వాణివిలే అలివేణివిలే.. నా మూన్ నువ్వులే జాణవులే’ అంటూ సాగే పాటను తేజ్, కేతిక శర్మలపై ఈ పాటను చిత్రీకరించారు. తిరుపతిలో జయశ్యామ్ థియేటర్‌లో అభిమానుల సమక్షంలో ఈ పాటను విడుదల చేశారు.
సాయుధరమ్ తేజ్, సముద్రఖని, ఎన్.వి. ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విదేశాలలో ఈ పాటను చిత్రీకరించినట్లు లొకేషన్స్ బట్టి తెలుస్తుంది. గత నెలలో విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మామ అల్లుళ్లు పవన్ మరియు సాయి ధరమ్ తేజ్ స్టైల్ మరియు డైలాగ్స్ ఫ్యాన్స్ ని ఏంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో ఇప్పుడు “బ్రో” ట్రైలర్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇంకా సినిమా రిలీజ్ అవ్వటానికి పది రోజులు మాత్రమే ఉండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున నిర్వహించడానికి సినిమా యూనిట్ రెడీ అవుతోంది.