National Awards 2023: 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఎంపిక కావడం తెలిసిందే. ఈ విభాగానికి అల్లు అర్జున్ తో పాటు ఎన్టీఆర్, చరణ్, సూర్య, జోజు జార్జి పోటీ పడగా చివర ఆఖరికి అల్లు అర్జున్ కె అవార్డు వరించింది. దీంతో భారతీయ చలనచిత్ర రంగంలో మొట్టమొదటిసారి జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అందుకుంటున్న తొలి తెలుగు హీరోగా అల్లు అర్జున్ రికార్డు క్రియేట్ చేశారు. బన్నీకి అవార్డు రావడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. 2021 ఏడాదికి సంబంధించి “పుష్ప” సినిమాకి గాను జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అల్లు అర్జున్ సొంతం చేసుకోవడం జరిగింది. దీంతో “పుష్ప” డైరెక్టర్ సుకుమార్ అవార్డు రావడం పట్ల ఎమోషనల్ అయ్యారు.
సరిగ్గా ఈ అవార్డు ప్రకటించిన టైంలో అల్లు అర్జున్ ఇంట్లోనే ఉండటంతో.. అతని గట్టిగా హత్తుకుని ఏడ్చేశారు. తెలుగు సినిమా రంగానికి భారీగా అవార్డులు రావడంతో చాలామంది ప్రముఖులు సినిమా సెలబ్రిటీలు రాజకీయ నాయకులు అభినందిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం జాతీయ అవార్డులు గెలిచిన తెలుగు నటీనటులను.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని జనసేన పార్టీ తరఫున అభినందిస్తూ పోస్ట్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. “69వ జాతీయ సినీ పురస్కారాలలో తెలుగు చిత్ర పరిశ్రమకు పలు విభాగాల్లో పురస్కారాలు దక్కడం ఎంతో సంతోషాన్ని కలిగించింది.
సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తూ.. సినిమా రూపకల్పనలో నిమగ్నమయ్యే నటులు, రచయితలు, సాంకేతిక నిపుణుల ప్రతిభకు పట్టం కట్టేలా జాతీయ పురస్కారాలు ఉంటున్నాయి. పుష్ప చిత్రానికిగాను శ్రీ అల్లు అర్జున్ ఉత్తమ నటుడుగా ఎంపిక కావడం అందరూ ఆనందించదగ్గ విషయం. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి తొలిసారి ఉత్తమ నటుడు అవార్డుకి ఎంపికైన శ్రీ అర్జున్ కి హృదయపూర్వక అభినందనలు” అని పవన్ కళ్యాణ్ అభినందించారు.