Virupaksha: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన “విరూపాక్ష” నిన్న విడుదలయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. మొదటి రోజే అన్ని సెంటర్స్ లో పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడం జరిగింది. చాలా కాలం తర్వాత తెలుగులో చేతబడి థ్రిల్లర్ నేపథ్యంలో సినిమా రావడంతో థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టడంతో “విరూపాక్ష” ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉంది. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజే రికార్డు స్థాయి కలెక్షన్స్ కొల్లగొట్టింది. మొదటిరోజు 12 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతేకాకుండా USAలో ప్రీమియర్ షోలు, ఫస్ట్ డే కలెక్షన్లు కలిపి 300k డాలర్ల గ్రాస్ పొందింది. అయితే సెకండ్ డే మరింతగా కలెక్షన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
రోడ్డు ప్రమాదం తర్వాత దాదాపు ప్రాణం పోయే పరిస్థితి నుండి మాట పోయిన తర్వాత వచ్చిన ఈ సినిమా విజయం సాధించటంతో మెగా ఫ్యామిలీ సాయి ధరమ్ తేజ్ నీ అభినందిస్తూ ఉంది. నిన్న మెగాస్టార్ చిరంజీవి అభినందించగా నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభినందించారు. ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ కి బొకేలు పంపించారు. దీనిని తేజ్ ట్విట్టర్ లో పంచుకుంటూ..”చాలా థాంక్స్ చిన్న మామ.. “విరూపాక్ష” నాకు గుర్తుండిపోయే రోజును ఇచ్చింది. ప్రేక్షకుల నుంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్, పెద్దమామయ్య నుంచి ప్రశంసలు వచ్చాయి అని చాలా ఆనందంగా ఉంది అంటూ సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేశారు.
అంతకు ముందు రోజే నిన్న మెగాస్టార్ చిరంజీవి సైతం సోషల్ మీడియాలో సాయిధరమ్ తేజ్ ని అభినందించారు. “విరూపాక్ష అద్భుతంగా ఉందని టాక్ వచ్చింది. తేజ్ కమ్ బ్యాక్ ఇవ్వటంపై నేనెంతో సంతోషంగా ఉన్నా. మీ సినిమాను ప్రేక్షకులు అభినందిస్తున్నందుకు, ఆశీర్వదిస్తున్నందుకు… ఆనందంగా ఉంది. మొత్తం టీం కి హృదయపూర్వక అభినందనలు” అని ట్వీట్ చేశారు. దీనిపై తేజ్ స్పందిస్తూ..”థాంక్స్ మామ, అత్త… లవ్ యు బోత్” అని కామెంట్ చేయడం జరిగింది.