33.2 C
Hyderabad
March 23, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Pawan Ram Charan: రామ్ చరణ్ ని అభినందించిన పవన్ కళ్యాణ్..!!

Share

Pawan Ram Charan: “RRR”తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగుతుంది. గత ఏడాది మార్చి నెలలో విడుదలైన ఈ సినిమా భారతీయ చలనచిత్ర రంగం యొక్క స్థాయిని పెంచేసింది. ఈ సినిమాతో దర్శకుడు రాజమౌళి మరింత ఉన్నత స్థానానికి ఎదిగారు. సరిగ్గా పాండమిక్ టైంలో ప్రపంచంలో ఏ సినిమా సాధించని రీతిలో ఈ సినిమా కలెక్షన్స్ సాధించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఫస్ట్ టైం చరణ్ మరియు ఎన్టీఆర్ కలిసి నటించిన సినిమా ప్రేక్షకులకు కొత్తగా అనిపించిన గాని… “RRR” చూసిన తర్వాత ఇద్దరు అన్నదమ్ములు మాదిరిగా నువ్వు నేనా అన్నట్టుగా నటించినట్లు కామెంట్లు చేశారు.

Pawan Kalyan congratulated Ram Charan

రామరాజుగా చరణ్ కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ తమ పెర్ఫార్మెన్స్ లతో దుమ్ము దులిపేశారు. ముఖ్యంగా “నాటు నాటు” సాంగ్ లో ఇద్దరూ అదిరిపోయే స్టెప్పులు వేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సాంగ్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా సొంతం చేసుకుంది. ఇంకా అనేక అంతర్జాతీయ అవార్డులు గెలవడం జరిగింది. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులు గెలుచుకుంది. రామ్ చరణ్ స్వయంగా హాలీవుడ్ వేదికపై అవార్డును సొంతం చేసుకున్నారు. ఇండియాలో ఈ అవార్డు మొట్టమొదటి గెలిచిన హీరోగా రామ్ చరణ్ చరిత్ర సృష్టించారు. దీంతో చాలామంది ప్రముఖులు సినిమా సెలబ్రెటీలు చరన్ ని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Pawan Kalyan congratulated Ram Charan

జనసేన అధినేత బాబాయ్ పవన్ కళ్యాణ్ కూడా…చరణ్ HCA అవార్డు గెలవటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. “ప్రతిష్టాత్మక హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో ‘ఆర్.ఆర్.ఆర్’ పలు పురస్కారాలు దక్కించుకోవడం ఆనందదాయకం. ఈ వేదికపై ‘బెస్ట్ వాయిస్/మోషన్ కాప్చర్ పెర్ఫార్మన్స్’ ను రామ్ చరణ్ ద్వారా ప్రకటింపచేయడం, స్పాట్ లైట్ అవార్డు స్వీకరించడం సంతోషాన్ని కలిగించింది. రామ్ చరణ్ కీ, దర్శకులు శ్రీ రాజమౌళికి, చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు. చరణ్ మరిన్ని మంచి చిత్రాలు చేసి అందరి మన్ననలు పొంది ఘన విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను”.. అనీ అభినందించారు.


Share

Related posts

RRR: యూఎస్ బాక్సాఫీసు వద్ద “ఆర్ఆర్ఆర్” రికార్డుల మోత..!!

sekhar

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా తక్కువ టైం లో కంప్లీట్ చేయటం కోసం హరీష్ శంకర్ సరికొత్త ప్లాన్..??

sekhar

Major Teaser: “మేజర్” టీజర్ ను రిలీజ్ చేసిన మహేష్..!!

bharani jella