న్యూస్ సినిమా

Pawan kalyan: ‘భీమ్లా నాయక్’ మూవీపై క్లారిటీ ఇవ్వండి గగ్గోలు పెడుతున్న ఫ్యాన్స్

Share

Pawan kalyan: ‘భీమ్లా నాయక్’ మూవీపై క్లారిటీ ఇవ్వండి అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారట. అందుకు కారణం అదే రోజున కొత్త సినిమాల రిలీజ్ తేదీలు ప్రకటించడమే. ఇన్ని రోజులు ‘భీమ్లా నాయక్’ సినిమాకు మరే సినిమా పోటీ లేదని అందరూ అనుకున్నారు. సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 25వ తేదీన రిలీజ్ చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే, ఇప్పుడు అదే తేదీన పవన్ సినిమా వస్తుందా ఏదా..అనేది అభిమానుల్లో సందేహాలను కలిగిస్తోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో మలయాళం సూపర్ హిట్ సినిమా అయ్యప్పనం కోషియం కి తెలుగు రీమేక్‌గా ‘భీమ్లా నాయక్’ రూపొందుతోంది.

pawan-kalyan-fans are requesting for clarity regarding bheemla nayak movie
pawan-kalyan-fans are requesting for clarity regarding bheemla nayak movie

అయితే, ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన డేట్‌నే ఇప్పుడు శర్వానంద్, కిషోర్ తిరుమల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే సినిమాను ప్రకటించారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా మీద అంచనాలు బాగానే ఉన్నాయి. ఇలా ఫిబ్రవరి 25నే ఎందుకు శర్వానంద్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారూ అంటే..ఆ రోజున పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా రూపొందుతున్న మల్టీస్టారర్ సినిమా ‘భీమ్లా నాయక్’ పోస్ట్ పోన్ అయ్యే సూచనలు గట్టిగానే కనిపిస్తుండటం వల్ల అట. వాస్తవంగా ఇటీవల ఇదే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కానీ, మేకర్స్ నుంచి మాత్రం క్లారిటీ రావడం లేదు.

Pawan kalyan: ‘భీమ్లా నాయక్’ మరోసారి వాయిదా అని వస్తున్న వార్తల్లో నిజం ఎంత..!

అంతేకాదు, అదే రోజున బాలీవుడ్‌లో ఆలియా భట్ ప్రధాన పాత్రలో రూపొందిన గంగుబాయి కతియావాడా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టు హిందీ మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా హిందీతో పాటు సౌత్ భాషలలో కూడా డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేయనున్నారు. అందుకే ఇప్పుడు ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25న రావడం లేదని మరో కొత్త విడుదల తేదీని చిత్రబృందం పరిశీలిస్తుందని ప్రచారం జరుగుతోంది. అందుకే పవన్ అభిమానులు ‘భీమ్లా నాయక్’ మరోసారి వాయిదా అని వస్తున్న వార్తల్లో నిజం ఎంతో తేల్చి చెప్పమని రిక్వెస్ట్ చేస్తున్నారట. చూడాలి మరి అభిమానుల కోరిక మేరకు ‘భీమ్లా నాయక్’ విడుదల వాయిదా పడుతుందనే విషయంలో అధికారికంగా నిర్మాతలు క్లారిటీ ఇస్తారేమో.

 


Share

Related posts

Bad Breath: ఎలాంటి  కారణం లేకుండా  చెడువాసన రావడం,పదే,పదే  ఆహారం లో వెంట్రుకలు రావడం జరిగితే కారణం ఇదే !!

siddhu

స‌మంత.. ల‌క్ష మొక్క‌లు

Siva Prasad

Girls: ఆడపిల్ల ల సంఖ్య తగ్గిపోవడం మే కాదు… వారిలో పెళ్లి చేసుకునే వారి సంఖ్య కూడా  తగ్గిపోతుంది ??(పార్ట్-2)

siddhu
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar