Harish Shankar: డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్ తరహాలో అదిరిపోయే సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. మిరపకాయ్, గబ్బర్ సింగ్.. ఇంకా హిట్ చిత్రాలతో.. దర్శకుడిగా మంచి గుర్తింపు పొందాడు. ఇదిలా ఉంటే హరీష్ శంకర్ స్వతహాగా పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అని అందరికీ తెలుసు. వరుస పరాజయాలలో పవన్ ఉన్న సమయంలో “గబ్బర్ సింగ్” అనే సినిమాతో మర్చిపోలేని బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వటం జరిగింది. పవన్ కెరియర్ లో రికార్డు స్థాయి కలెక్షన్స్ ఈ సినిమా రాబట్టింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో “భగత్ సింగ్ భవదేయుడు” అనే సినిమా ప్రకటన చేయడం తెలిసిందే. దాదాపు ఈ సినిమా ప్రకటించి రెండు సంవత్సరాల అయిపోతుంది. ఇప్పటికీ కూడా సినిమా షూటింగ్ స్టార్ట్ కాలేదు. ఇలాంటి తరుణంలో వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఆగిపోయినట్లు మరో సినిమా స్టార్ట్ అయినట్లు ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. విజయ్ దళపతి బ్లాక్ బస్టర్ మూవీ తేరి (పోలీసోడు) పవన్ నీ హీరోగా పెట్టి డైరెక్టర్ హరీష్ శంకర్ రీమేక్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
దీంతో వస్తున్న వార్తలపై పవన్ కళ్యాణ్ అభిమానులు డైరెక్టర్ హరీష్ శంకర్ పై మండిపడుతున్నారు. అంతేకాదు ట్విట్టర్ వేదికగా విమర్శలకు దిగారు. “మాకు రీమేక్ అక్కర్లేదు. డైరెక్ట్ సినిమా చేయండి. మీ కాంబినేషన్లో మరో బ్లాక్ బస్టర్ కావాలి”అని #WEDONTWANTRIMAKE…హ్యాశ్ ట్యాగ్ తో ట్వీట్ లు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రీమేక్ సినిమా వద్దు… స్ట్రైట్ సినిమా చేయండి అని పవన్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.