Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వరుసగా వకీల్ సాబ్ భీమ్లా నాయక్ సినిమాలతో రెండు భారీ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు. అయితే, వాస్తవంగా భీమ్లా నాయక్ సినిమా కంటే పవన్ నుంచి రావాల్సిన సినిమా హరిహర వీరమల్లు. కానీ, మధ్యలో అనూహ్యంగా మలయాళ బ్లాక్ బస్టర్ అయ్యప్పనుమ్ కోషి యుమ్ కమిటవడంతో ఈ సినిమా డిలే అయింది. అదే సమయంలో కరోనా వేవ్స్, పవన్‌కు కరోనా సోకడం లాంటి పలు కారణాలతో వీరమల్లు దాదాపు 15 నెలల నుంచి సెట్స్ మీదకు రాలేదు.
పవర్ స్టార్‌తో ఖుషి లాంటి ఇండస్ట్రీ హిట్, బంగారం వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించిన స్టార్ ప్రొడ్యూసర్ ఎ.ఎం. రత్నం హ్యాట్రిక్ సినిమాగా పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా చారిత్రక కథతో ‘హరి హర వీరమల్లు’ మూవీని ప్రారంభించారు. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ క్రిష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇక 17 వ సెంచరీ కాలంలోని మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంగా వీరమల్లు పాన్ ఇండియన్ రేంజ్లో 5 భాషలలో తెరకెక్కుతోంది. అంతేకాదు ఈ సినిమా పవన్ కెరీర్లోనే ఫస్ట్ పీరియాడికల్ సినిమా కావడం విశేషం.
Pawan Kalyan: ఆగస్టు వరకు హరిహర వీరమల్లు చిత్రీకరణ మొతం కంప్లీట్..!
అయితే, తాజా షెడ్యూల్ కోసం పవన్ షాకింగ్‌గా 5 నెలల పాటు కంటిన్యూస్‌గా డేట్స్ ఇచ్చారట. వీరమల్లు పూర్తయ్యే వరకు మరో సినిమా షూటింగ్లో పాల్గొనబోరని తెలుస్తోంది. ఈ సినిమా తన వల్ల ఇన్ని నెలలు ఆగిపోయిన కారణంగానే నిర్మాతకు సపోర్ట్ చేస్తూ ఏకంగా 5 నెలలు షూటింగ్‌కు డేట్స్ ఇచ్చారని సమాచారం. ఏప్రిల్ 6 నుంచి మొదలు పెట్టి ఆగస్టు వరకు హరిహర వీరమల్లు చిత్రీకరణ మొతం కంప్లీట్ చేయనున్నా రు. అన్నీ అనుకున్నట్టు కంప్లీట్ అయితే వచ్చే సంక్రాంతికి గానీ, లేదా ఇదే ఏడాది దీపావళి, క్రిస్మస్ పండుగలలో ఒక పండుగ కానుకగా రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!