న్యూస్ సినిమా

Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’పై అంచనాలు పెంచేస్తున్న సోలో సాంగ్..ఒక్క సెట్‌కు అన్ని కోట్లా..?

Share

Pawan Kalyan: దాదాపు 15 నెలల లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ సెట్స్ మీదకొచ్చింది హరిహర వీరమల్లు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో రూపొందుతున్న మొదటి పాన్ ఇండియన్ సినిమా ఇది. విజనరీ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాను ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం దాదాపు రూ 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్‌లో దాదాపుగా తెరకెక్కుతున్న చిత్రాలన్నీ పాన్ ఇండియన్ స్థాయిలోనే.

pawan-kalyan-hari hara veeramallu is increasing expectations
pawan-kalyan-hari hara veeramallu is increasing expectations

ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ ఛాప్టర్ 2, బాలీవుడ్‌లో వచ్చిన ది కశ్మీర్ ఫైల్స్ చిత్రాల తర్వాత ఇటు సౌత్‌లో అటు బాలీవుడ్‌లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీస్‌పై అంచనాలు భారీగా నెలకొంటున్నాయి. మేకర్స్ ఆ అంచనాలను అందుకునేందుకు బడ్జెట్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. ఇక దర్శకుడు క్రిష్ కూడా హరిహర వీరమల్లు కోసం ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ బందిపోటు దొంగగా మూడు విభిన్నమైన పాత్రల్లో ముప్పై రకాల గెటప్పులలో కనిపించబోతున్నారని సమాచారం.

Pawan Kalyan: ఆ సెట్ కోసం దాదాపు రూ 2 కోట్ల వరకు ఖర్చు..!

17వ శతాబ్దం నాటి మొఘలుల కాలం కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అప్పటి పరిస్థుతులను కళ్ళకు కట్టినట్టు చూపించేందుకు ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ పద్మశ్రీ తోట తరణి ఆద్వర్యంలో భారీ సెట్స్ నిర్మించారు. దీనిలో భాగంగానే పవన్ కళ్యాణ్ మీద ఓ సోలో సాంగ్ చిత్రీకరణను జరపనున్నారు. ఈ నెల 20 నుంచి  పవన్ పై ఓ సాంగ్ ను షూట్ చేయనున్నా రు. ఈ సాంగ్ లో పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ ఉంటాయట. ఇక దీని కోసమే రామోజీ ఫిల్మ్ సిటీ లో ఓ భారీ సెట్ ను కూడా నిర్మించారని ..ఆ సెట్ కోసం దాదాపు రూ 2 కోట్ల వరకు ఖర్చు చేశారని సమాచారం. సినిమాలో ఈ సాంగ్ చాలా హైలెట్‌గా నిలుస్తుందట. అందుకే, అంత భారీ సెట్ వేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి అంతకంతా వీరమల్లుపై అంచనాలు పెంచేస్తున్నారు మేకర్స్.


Share

Related posts

హైదరాబాద్ ప్రజలకు కొత్త సంవత్సరం సరికొత్త గిఫ్ట్ ఇవ్వబోతున్న కేసీఆర్..!!

sekhar

రైతు ఉద్యమం పై కుట్రలెలా ? ; ఇవిగో సమాధానాలు

Special Bureau

బ్రేకింగ్: 22న మధ్యాహ్నం తర్వాత జగన్ క్యాబినెట్ విస్తరణ

Vihari
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar