Pawan Kalyan: టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా మూడు సంవత్సరాల తర్వాత రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్టయ్యింది. ఇటీవల “వకీల్ సాబ్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్…లాయర్ పాత్రలో అదరగొట్టాడు. బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు పగలగొట్టారు. ఇలాంటి తరుణంలో అనేక సినిమాలను ఒప్పుకున్న పవన్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా డా సినిమా ఓకే చేయడం తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో “గబ్బర్ సింగ్” సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో… వస్తున్న రెండో సినిమాపై పవన్ అభిమానుల్లో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.
ఇప్పటికే ఈ సినిమా స్టోరీ గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. తండ్రి కొడుకులు మాదిరిగా సినిమాలో ఇద్దరు పవన్ కళ్యాణ్ లను చూపించడానికి హరీష్ శంకర్ రెడీ అయినట్లు ఇటీవల వార్తలు అవుతున్నాయి. ఇదిలావుంటే ఇటీవల పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైలిస్ట్ ఓ ప్రముఖ వెబ్ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా హరీష్ పవన్ సినిమా గురించి సరికొత్త కామెంట్ చేశారు. హరీష్ శంకర్ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్… ఫ్యాన్స్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని, చాలా డిఫరెంట్ గా పవన్ కళ్యాణ్ నీ హరీష్ శంకర్ చూపించబోతున్నాడు అని తెలిపాడు. అంతేకాకుండా వకీల్ సాబ్ సినిమాలో ఉన్న లుక్ కి మించి పదిరెట్లు ఉంటుందని స్పష్టం చేశాడు. దీంతో పవన్ హెయిర్ స్టైలిస్ట్ చేసిన కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. మరోపక్క హరీష్ స్క్రిప్ట్ పరంగా పవన్ కళ్యాణ్ తన వేషధారణ ఇప్పటి నుండే మార్చుకోవటం స్టార్ట్ చేశారట. ఈ సినిమా త్వరగా కంప్లీట్ చేసే తరహాలో పవన్ కళ్యాణ్ .. నిర్మాతలతో చర్చించినట్లు .. అందుకు తగ్గ రీతిలో హరీష్ కూడా అతి తక్కువ షెడ్యూల్ లో సినిమా కంప్లీట్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!