Pawan Kalyan: దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్” తో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పవన్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఫస్ట్ డే ఫస్ట్ షో నుండి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో ఓపెనింగ్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. పవర్ స్టార్ స్టామినా ఏంటో మరోసారి “వకీల్ సాబ్” నిరూపించింది. ఇదిలాఉంటే హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తున్న సినిమాలో పవన్ ప్రాజెక్టు ఒకటి ఓకే అయిన సంగతి తెలిసిందే.
గత ఏడాది పవన్ పుట్టిన రోజు సందర్భంగా అధికారికంగా ‘పిఎస్పీకే 28’ అనే వర్కింగ్ టైటిల్ కూడా ప్రకటించడం జరిగింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ గా వార్త వైరల్ అవుతుంది. గతంలోనే హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ “గబ్బర్ సింగ్” అనే సినిమా చేయడం తెలిసిందే. సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే గబ్బర్ సింగ్ పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాగా కలెక్షన్లు రాబట్టింది.
ఇప్పుడు ఇదే తరహాలో పవన్ కళ్యాణ్ ని చూపించడానికి హరీష్ శంకర్ రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా సినిమాలో డబల్ ఫోజ్ లో పవన్ కళ్యాణ్ కనిపించనున్నట్లు లేటెస్ట్ టాక్. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పనులు పూర్తి చేసినట్లు, త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసే ఆలోచనలో ‘పిఎస్పీకే 28’ సినిమా యూనిట్ వుంది. ప్రస్తుతం దగ్గుబాటి రానా తో మలయాళం సూపర్ డూపర్ హిట్ సినిమా ‘అయ్యప్పనమ్ కోషియం’ తెలుగు రీమేక్ అదేవిధంగా క్రిష్ దర్శకత్వంలో “హరిహర వీరమల్లు” ప్రాజెక్టుల్లో పవన్ నటిస్తున్నాడు. ఈ రెండు ప్రాజెక్టులు అయిన వెంటనే పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ సినిమా స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం.