BRO Teaser: సముద్ర ఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం “బ్రో” టీజర్ ఈరోజు సాయంత్రం విడుదలయ్యింది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా నటించడం జరిగింది. మెగా హీరోతో ఫస్ట్ టైం పవన్ మల్టీస్టారర్ కలిసి నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళంలో వినోదయ సీతం సినిమాకి రీమిక్ గా తెరకెక్కటం జరిగింది. అక్కడ సూపర్ డూపర్ హిట్ అయింది. తమిళంలో ప్రధాన పాత్ర పోషించిన సముద్ర ఖని… తెలుగు సినిమాకి దర్శకత్వం వహించటం విశేషం. ఈ రోజు ఈ సినిమా టీజర్ జూన్ 29వ తేదీన సాయంత్రం విడుదల చేశారు.
టీజర్ లో పవన్ కళ్యాణ్ చాలా ఎనర్జిటిక్ గా కనిపించారు. “తమ్ముడు” సినిమా తరహా లుక్ లో ఈ సినిమాలో పవన్ ఒకానొక డ్రెస్ లో కనిపించడం జరిగింది. చాలా స్టైలిష్ డైలాగులతో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో తమన్ అదరగొట్టే బాణీలు అందించడం జరిగింది. సాయి ధరమ్ తేజ్ చాలా అమాయకంగా కనిపించాడు. టీజర్ లో పవన్ చాలా స్టైలిష్ లుక్ లో.. సాయి ధరమ్ తేజ్ నీ గైడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రకంగా టీజర్ అదరగొట్టింది. ఫస్ట్ టైం మామ అల్లుడు నటించిన ఈ సినిమా అభిమానులను ఎంతగానో అలరించింది.
తాజాగా విడుదలైన “బ్రో” టీజర్ సినిమాపై మరింత హైపు పెంచింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన ఫోటోలు మరియు పోస్టర్లు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాగా తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై మరింతగా అంచనాలను పెంచేయడం జరిగింది. జులై 28వ తారీకు ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో దాదాపు గంటపాటు పవన్ కళ్యాణ్ పాత్ర ఉండబోతుందని సమాచారం. పవన్ కళ్యాణ్ కంటే సాయిధరమ్ తేజ్ పాత్ర ఎక్కువ ఉన్నాగాని పవన్.. ఉన్నంతసేపు ఆయన పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండే రీతిలో స్క్రిప్ట్ సముద్ర ఖని డిజైన్ చేయడం జరిగిందట.