Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తావన అవసరం లేదేమో. ఈ శక్రవారం విడుదలైన ‘భీమ్లానాయక్’ సినిమా గురించి కూడా చెప్పుకోవాల్సిన పనిలేదు. విడుదలైన మొదటిరోజు నుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని, ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతోంది. ఊహించని విధంగా పవన్ హైవోల్టేజ్ పాత్రలో నటించడంతో ఈ మూవీ థియేటర్ల వద్ద ఫ్యాన్స్ జాతర చేసుకుంటున్నారు. విడుదలై నాలుగు రోజులు అవుతున్నా, పవన్ కళ్యాణ్ స్ట్రోమ్ ని ఎవరూ ఆపలేకపోతున్నారు.
Pawan kalyan: బ్రేక్ ఈవెన్‌ను టచ్ చేస్తున్న భీమ్లా నాయక్.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కొత్త సినిమా సంగతి?
భీమ్లానాయక్ సక్సెస్ జోష్ లో వున్న పవన్ కల్యాణ్ తాజాగా మరో రీమేక్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వరుస రీమేక్స్ అయినటువంటి వకీల్ సాబ్, భీమ్లానాయక్ వంటి బ్లాక్ బస్టర్ లని తన ఖాతాలో వేసుకున్న పవన్ అదే వరుసలో మరో 2 రీమేక్ లకు సై అన్నారని వినికిడి. తమిళంలో సముద్రఖని నటించి తెరకెక్కించిన చిత్రం ‘వినోదాయ సితం’ సినిమాని రీమేక్ ని చేయడానికి పవన్ కల్యాణ్ ఓకే చెప్పారట. ఇప్పటికే ఈ మూవీ రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకుని దీని బాధ్యతల్ని త్రివిక్రమ్ చేతిలో పెట్టారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
Pawan kalyan: ఇక పై పవన్ సినిమాల నుంచి ఆ ఒక్కరిని తప్పించండి ప్లీజ్ అంటూ వేడుకుంటున్న అభిమానులు..!
పవన్ మరో తాజా సినిమా సంగతి?
అలాగే మరో తమిళ సినిమా అయినటువంటి ‘థేరీ’ సినిమాని కూడా చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ రీమేక్ కి ప్రభాస్ ‘సాహో’ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం చేయబోతున్నాడట. ఇక ఈ సినిమాకి ‘అత్తారింటికి దారేది’ సినిమా ప్రొడ్యూసర్ DVV దానయ్య నిర్మాతగా బాధ్యతలు తీసుకోనున్నారట. ఇప్పటికే రీమేక్ కి సంబంధించిన మార్పులు చేర్పులు జరుగుతున్నాయని వినికిడి. ‘హరి హర వీరమల్లు’, ‘భవదీయుడు భగత్‌సింగ్’ చిత్రాలు పూర్తి చేసిన తరువాతే ఈ సినిమా ఉండబోతుంది.