29.2 C
Hyderabad
March 21, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Pawan Kalyan: ఒకేసారి రెండు సినిమా షూటింగ్ లలో పాల్గొనబోతున్న పవన్ కళ్యాణ్..?

Share

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఏడాది ఎన్నికల జరగనున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచారు. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క విజయవంతంగా రాజకీయాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం మాత్రం సినిమాల పైన ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరిగింది. వాస్తవానికి వారాహి వాహనం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని పవన్ రెడీ అయ్యారు. ఈ క్రమంలో పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఆ తర్వాత ఒక్కసారిగా సినిమాలు ఒప్పుకోవటంతో ఇప్పుడు షూటింగ్ లలో బిజీగా ఉంటున్నారు.

Pawan Kalyan is going to participate in the shooting of two movies at the same time

ప్రస్తుతం సముద్రఖని దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ తో కలసి పవన్ మల్టీస్టారర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “వినోదయ సీతం” సినిమాకి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. కేవలం 30 రోజులు మాత్రమే ఈ సినిమా షూటింగ్ కి పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వటం జరిగిందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇందుకు గాను 50 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో పవన్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ అయిన వెంటనే పవన్ రెండు సినిమాల షూటింగ్ లలో జాయిన్ కానున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

Pawan Kalyan is going to participate in the shooting of two movies at the same time

పూర్తి విషయంలోకి వెళ్తే సుజిత్ దర్శకత్వంలో నటించే OG, అదేవిధంగా హరిశ్ శంకర్ దర్శకత్వంలో చేయబోయే ఉస్తాద్ భగత్ సింగ్… సినిమాల షూటింగ్ లలో జాయిన్ కానున్నారట. హరీష్ శంకర్ సినిమాకీ సంబంధించి సెట్స్ పనులు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి అన్ని చూసుకుంటున్నారు. గబ్బర్ సింగ్ వంటి భారీ బ్లాక్ బస్టర్ తీసిన డైరెక్టర్ కావడంతో…ఉస్తాద్ భగత్ సింగ్ పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.


Share

Related posts

హ్యాట్రిక్‌పై కన్నేసిన ర‌వితేజ‌

Siva Prasad

Samantha: ధన్యవాదాలు తెలియజేస్తూ సమంత మరో ఎమోషనల్ పోస్ట్..!!

sekhar

Pushpa: “పుష్ప” సెకండ్ పార్ట్ విషయంలో మరో సంచలన నిర్ణయం తీసుకున్న సుకుమార్..??

sekhar