Khushi: 2001వ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ నటించిన “ఖుషి” సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తెలిసిందే. ఎస్ జె సూర్య దర్శకత్వంలో.. ఏఎం రత్నం నిర్మించిన ఈ సినిమా పవన్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ప్రేమ కథ నేపథ్యంలో భూమిక మరియు పవన్ సన్నివేశాలు అప్పటి కురకారును ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా వచ్చి దాదాపు 22 సంవత్సరలు అవుతుంది. అయినా గాని ఈ సినిమా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని తాజాగా రీ రిలీజ్ నేపథ్యంలో రుజువయ్యింది.

విషయంలోకి వెళ్తే ఇటీవల రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో న్యూ ఇయర్ సందర్భంగా ఖుషి మళ్లీ విడుదల చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలలో స్పెషల్ షోస్ వేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ₹4.15 కోట్లు కొల్లగొట్టడం జరిగింది. వీటిలో తెలుగు రాష్ట్రాల్లోనే ₹3.62 కోట్ల వసూళ్లు దక్కాయి. రీరిలీజ్ అయిన చిత్రాల్లో తొలి రోజే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ‘ఖుషి’ రికార్డు సాధించింది. ఇప్పటివరకు ₹3.20 కోట్లతో అగ్రస్థానంలో ఉన్న తన ‘జల్సా’ రికార్డునే పవన్ బ్రేక్ చేశాడు.

మహేశ్ బాబు ‘పోకిరి’ చిత్రం రీరిలీజ్ లో ₹1.52 కోట్లతో మూడో స్థానంలో ఉన్నట్టు ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. థియేటర్లలో “ఖుషి” స్పెషల్ షోలకు సంబంధించి ఫ్యాన్స్ హడావిడి సోషల్ మీడియాలో విపరీతంగా కనిపిస్తూ ఉంది. సినిమాల పాటలు మరియు ఫైట్స్… వాటికి జనాలు చేస్తున్న హడావిడి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ క్రేజ్.. ఈ సినిమాతో మరోసారి నిరూపితమైంది. మామూలు సినిమాలతో మాత్రమే కాదు రీ రిలీజ్ లో కూడా రికార్డులు సృష్టించడం పవన్ కళ్యాణ్ సొంతమని ఫ్యాన్స్ తాజా “ఖుషి” కలెక్షన్స్ పై కామెంట్లు చేస్తున్నారు.