Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో “హరిహర వీరమల్లు” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మొగలుల సామ్రాజ్య కాలం నాటి కథ నేపథ్యంలో.. తెరకెక్కుతున్న ఈ సినిమాలో గుర్రపు స్వారీలు పోరాట సన్నివేశాలు ఓ రేంజ్ లో ఉండేలా చూసుకుంటూ ప్రతి చిన్న సీన్ విషయంలో డైరెక్టర్ క్రిష్ జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఈ నేపథ్యంలో మామూలుగానే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న పవన్ ఈ సినిమాలో పోరాట సన్నివేశాల కోసం మరికొన్ని యుద్ధవిద్యలు… ఇంటర్నేషనల్ స్థాయి ప్రొఫెషనల్స్ ఫైటర్స్ వద్ద నేర్చుకోవడం జరిగింది. వాటికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో రావడం మనం చూశాం.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ సిల్వర్ స్క్రీన్ పై అద్భుత రీతిలో ఉండాలని డైరెక్టర్ క్రిష్ వరల్డ్ క్లాస్… ప్రొఫెషనల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇండస్ట్రీలో సరికొత్త వార్తలు వినబడుతోంది. దాదాపు సినిమాలో ఎక్కువ బడ్జెట్ ఈ విజువల్ ఎఫెక్ట్స్ కే ఖర్చు చేయనున్నట్లు సమాచారం. చాలా అతి పెద్ద సంస్థ నీ డైరెక్టర్ క్రిష్.. సంప్రదించడం జరిగింది అని టాక్.
గుర్రపుస్వారీ ఫైట్లు… ఒక భారీగా యుద్ధ సన్నివేశాలు ఉండాలని.. పవన్ కళ్యాణ్ నీ పోరాట యోధుడిగా సరికొత్త రీతిలో అభిమానులకు ఆవిష్కరించాలని.. డైరెక్టర్ క్రిష్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఖుషి నిర్మాత సూర్య చాలా కాలం తర్వాత సినిమా నిర్మిస్తూ ఉండటంతో.. పైగా భారీ బడ్జెట్ చిత్రం కావడంతో అభిమానులు ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నారు.