Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజవుతుందంటే బాక్సాఫీస్ దగ్గర వాతావరణం ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలుసు. ఇతర హీరోలు పవన్ సినిమా రిలీజ్ అయ్యే టైంకి పొరపాటున కూడా రిలీజ్ చేయరు. ఒకవేళ రిలీజ్ చేసిన సదరు సినిమా థియేటర్ దగ్గర ఖాళీ జనాలే. ఆ రీతిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి ఓపెనింగ్స్ భారీగా ఉంటాయి. ఇదిలాఉంటే హరీష్ శంకర్ దర్శకత్వంలో.. గతంలో పవన్ గబ్బర్ సింగ్ సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ చేయటం మనకందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇదే రీతిలో మరోసారి హరీష్ దర్శకత్వంలో పవన్ సినిమా ఒప్పుకున్నారు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్టు వర్క్ పూర్తి చేసిన హరీష్ శంకర్… సినిమాలో నటీనటులను తీసుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. కాగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని చాలా కొత్తగా చూపించాలని… అభిమానులు ఎవరూ ఊహించని రీతిలో సమాజాన్ని … రాజకీయాల్ని ప్రభావితం చేసే తరహాలో.. పవన్ క్యారెక్టర్ తీర్చిదిద్దినట్లు ఇండస్ట్రీలో టాక్.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ని మెగాస్టార్ అప్పట్లో నటించిన మాస్టర్ సినిమా తరహాలో లెక్చరర్ పాత్రలో చూపించాలని హరీష్ ప్లాన్ చేశారట. దీనిలో భాగంగా హైదరాబాదులో భారీ కాలేజ్ సెట్ కూడా వెయిటింగ్ జరిగిందని… వార్తలు వస్తున్నాయి. లెక్చలర్ పాత్రలో పవన్ కళ్యాణ్ విద్యా పాఠాలు మాత్రమే కాక అనేక రీతులుగా సమాజాన్ని ప్రభావితం చేసే తరహాలో… కాలేజీలో యువతను చైతన్య పరిచే విధంగా… పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ తీర్చిదిద్దినట్లు ఫిలింనగర్ టాక్.