33.2 C
Hyderabad
March 23, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Pawan Kalyan: మేనల్లుడుతో మల్టీస్టారర్ ప్రాజెక్టుకు సంబంధించి పవన్ కళ్యాణ్ లుక్స్ అదుర్స్..!!

Share

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో మల్టీస్టారర్ “వినోదయ సీతం” తమిళ రీమేక్ తెలుగులో పవన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సముద్రఖని దర్శకుడు. కాగా నేడు ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభం కానుంది. సాయి ధరమ్ తేజ్ కీలకపాత్రలో కనిపిస్తున్నారు. అప్పట్లో “గోపాల గోపాల” సినిమా తరహా లోనే ఈ సినిమా స్టోరీ ఉండనున్నట్లు సమాచారం. ఈ సినిమాకి ఎప్పటిలాగే త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మాటలు… అందించనున్నారట. ఈ సినిమాలో పవన్ దేవుడిగా కనిపించనున్నారు.

Pawan Kalyan Looks Adurs Regarding Multistarrer Project With Nephew

కేవలం 15 నుండి 20 రోజులు మాత్రమే పవన్ ఈ సినిమాకి డేట్స్ కేటాయించడం జరిగింది. ఇన్ని రోజులకు గాను పవన్ కళ్యాణ్… 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. పీపుల్స్ మీడియా ఈ సినిమా నిర్మిస్తుంది. లేటెస్ట్ గా ఈ ప్రాజెక్టుకు సంబంధించి దర్శకుడు సముద్ర ఖనితో పాటు హీరో సాయిధరమ్ తేజ్… త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ లుక్స్ అదరగొట్టాయి. చాలా స్టైలిష్ గా పవన్ కనిపించడంతో ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం పవన్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో… “హరిహర వీరమల్లు” చేస్తున్నారు. ఇది ఏప్రిల్ నెలలో రిలీజ్ కానుంది. ఇంకా హరీష్ శంకర్ దర్శకత్వంలో “ఉస్తాద్ భగత్ సింగ్”… సుజిత్ దర్శకత్వంలో “OG” అనే సినిమా చేస్తున్నారు. ఇంకా మరి కొంతమంది దర్శకులు పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేయటానికి రెడీగా ఉన్నారు.

Pawan Kalyan Looks Adurs Regarding Multistarrer Project With Nephew

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ప్రాజెక్టులు మొత్తం కంప్లీట్ చేయడానికి పవన్ ప్రస్తుతం బిజీగా ఉన్నారట. సుజిత్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న సినిమా గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ తరహాలో ఉంటుందని సమాచారం. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది అంట. అయితే అన్నిటికంటే ముందు “వినోదయ సీతం” కంప్లీట్ చేసి మిగతా సినిమాలు ప్రారంభించాలని పవన్ డిసైడ్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.


Share

Related posts

Radhey Shyam: ఈ 3 హైలైట్ లు చాలు.. ‘రాధే శ్యామ్’ బ్లాక్ బస్టర్ అవ్వడానికి!

Ram

`వాల్మీకి`పై సెన్సార్ బోర్డుకి ఫిర్యాదు

Siva Prasad

Ravibabu: భూమిక వలన రవిబాబు ఇంట్లో నుంచి బయటకు రాలేకపోయారట.. ఎందుకో తెలుసా ??

Naina