Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఒక పక్క రాజకీయాలు మరోపక్క సినిమాలు చేస్తూ కెరియర్ రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలె “బీమ్లా నాయక్” రిలీజ్ చేసి సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా విజయంతో పవన్ ఫుల్ హ్యాపీ గా ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే “బీమ్లా నాయక్” షూటింగ్ జరుగుతూ ఉండగానే మరోపక్క క్రిష్ దర్శకత్వంలో “హరిహర వీరమల్లు” షూటింగ్ స్టార్ట్ చేయడం తెలిసిందే. దాదాపు ఈ సినిమాకి సంబంధించి సగం షూటింగ్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. ఖుషి నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా చారిత్రక నేపథ్యంతో కూడినది.
మొఘలుల కాలం నాటి స్టొరీతో ఈ సినిమా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా సినిమాలో పోరాట సన్నివేశాల కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన యుద్ధవిద్యలు కూడా… అభ్యసించినట్లు టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఈ నెల 18 వ తారీకు నుండి కొత్త షెడ్యూల్ మొదలు పెట్టాలని… పవన్ కళ్యాణ్ డిసైడ్ కాగా.. ఇప్పుడు ఆ షెడ్యూల్ ఆగిపోయినట్లు టాక్. ఈ నేపథ్యంలో ఏప్రిల్ రెండో వారం నుండి కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసే ఆలోచనలో పవన్ ఉన్నట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది.
సినిమాలో గుర్రపు స్వారీలు మరియు పోరాట సన్నివేశాలలో పవన్ నీ…క్రిష్ సరి కొత్తగా చూపించనున్నట్లు టాక్. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు ఆస్కారం ఉన్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో ఈ సినిమా అర్ధాంతరంగా కూడా ఆగిపోయే అవకాశం ఉందని మరోపక్క టాక్ నడుస్తోంది. ఇటీవలే జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ తాను పాదయాత్ర చేయడానికి రెడీ అన్న తరహాలో కామెంట్లు చేయటంతో… పవన్ మళ్లీ సినిమాల ఆపేసే అవకాశం ఉందని బయట టాక్ నడుస్తోంది.