పవన్ ప్రొడ్యూసర్‌గా త్రివిక్రమ్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా సినిమా రానుందా? ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ ఇదే. పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై పవన్ కల్యాణ్ నిర్మించే చిత్రంలో రామ్‌చరణ్ నటిస్తారని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఒకట్రెండు సార్లు వారిద్దరు కూడా చూచాయగా అంగీకరించారు. ఆ తర్వాత అటు బాబాయ్ పాలిటిక్స్ తోనూ, ఇటు అబ్బాయి నిర్మాణంలోనూ, నటనలోనూ బిజీ బిజీ. అందుకే ఎవరూ ఆ టాపిక్ తీసుకుని రాలేదు. అయితే తాజాగా ఇప్పుడు ఆ టాపిక్ మళ్లీ చక్కర్లు కొడుతోంది. ఇటీవల తనను కలిసిన త్రివిక్రమ్‌తో పవన్ కల్యాణ్ ఈ టాపిక్ తెచ్చినట్టు వినికిడి. చరణ్‌ని దృష్టిలో పెట్టుకుని మంచి కథను సిద్ధం చేయమని చెప్పారట. ప్రస్తుతం త్రివిక్రమ్ బన్నీ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అయ్యాక చరణ్ కోసం స్టోరీ ప్రిపేర్ చేస్తారని తెలుస్తోంది. మరోవైపు చరణ్ కూడా ఆర్ ఆర్ ఆర్తో బిజీగా ఉంటారన్నమాట. 2020కి అందరూ తమ ప్రాజెక్టులను ఫుల్పిల్ చేసుకుంటారు. అప్పుడు ఈ నయా ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టొచ్చన్నది టాక్. మరోవైపు ఎన్టీఆర్ కూడా ఆర్ ఆర్ ఆర్ తర్వాత త్రివిక్రమ్ఃతో సినిమా చేయవచ్చనే టాక్ వినిపిస్తోంది.
previous post
next post
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!