Pawan Kalyan: పూర్తి సమయం జనసేన పార్టీ కార్యకలాపాల కోసమే కేటాయించిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏకంగా మూడేళ్లు సినిమాలకు దూరంగా వున్న సంగతి మనకు తెలిసినదే. ఇక ఆ తరువాత ‘వకీల్ సాబ్’ అనే చిత్రంతో మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి బాక్సీఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసాడు. దాంతో పవన్ బ్లాక్ టు బ్యాక్ సినిమాలని ప్రకటించేశారు. అంగీకరించిన ప్రాజెక్ట్ లని స్పీడుగా పూర్తి చేసి మళ్లీ క్రియాశీల రాజకీయాల్లో బిజీగా మారిపోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు.
Pawan kalyan – Varun tej: డబుల్ ట్రీట్ ఉంటుందనుకున్న మెగా అభిమానులకు ఇది పెద్ద డిసప్పాయింట్మెంట్
Pawan Kalyan: లైన్ లో వున్న సినిమాలు!
తాజాగా పవన్ నుండి ‘భీమ్లానాయక్’ చిత్రం రావడం, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం మనం చూసాం. ఈ మూవీ తరువాత పవన్ ప్రస్తుతం క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రంతో బిజీ అయిపోయాడు. ఈ మూవీ పూర్తయిన తరువాత పవన్ కల్యాణ్ మరో రీమేక్ చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అవే తమిళంలో సముద్రఖని నటించి రూపొందించిన ‘వినోధాయ సితం’, మరియు విజయ్ నటించిన సినిమా ‘తెరి’. ఈ సినిమాల్ని పవన్ చేయడానికి మొగ్గు చూపుతున్నాడట?
Pawan kalyan: సినిమాలకు మళ్ళీ బ్రేక్ అడ్వాన్స్ ఇచ్చిన ఆ నిర్మాతల పరిస్థితేంటీ..?
ఈ సినిమాల పరిస్థితి ఏమిటి?
ఈ క్రమంలో ఇద్దరు క్రేజీ స్టార్ డైరెక్టర్ ల చిత్రాలని పవన్ కల్యాణ్ వాయిదా వేస్తున్నట్టు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో పవన్ ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా చేయాల్సి వుంది. దానికోసం హరీష్ ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. అలాగే డైరెక్టర్ సురేందర్ రెడ్డితో రామ్ తాళ్లూరి నిర్మించనున్న చిత్రం కూడా లైన్ లో వుంది. ఇక రీమేక్ మూవీ కారణంగా హరీష్ శంకర్ చిత్రాన్ని వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేసిన పవన్ కల్యాణ్ .. సురేందర్ రెడ్డి మూవీని కూడా పక్కన పెట్టినట్టుగా సమాచారం.