డియర్ పవన్ ఫాన్స్.. మరొక గబ్బార్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ కి సిద్ధం అవ్వండి!

బండ్ల గణేష్.. ఈ వ్యక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రలలో నటించి కామెడీ పండించిన కమెడియన్ బండ్ల గణేష్. ఎన్నో సినిమాల్లో ఎంతో అద్భుతంగా నటించిన ఈ కమెడియన్ ఏకంగా ఒకేసారి ప్రొడ్యూసర్ అవతారం ఎత్తాడు. అది కూడా చిన్న చిన్న సినిమాలకు కాదు.. ఏకంగా స్టార్ హీరోలతో సినిమాలు తీశాడు.

 

నిర్మాతగా తీసిన మొదటి చిత్రమే బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టింది అంటే నమ్మండి. అప్పట్లో ఇండస్ట్రీలో మంచి ప్రొడ్యూసర్ గా కాదు కాదు టాప్ ప్రొడ్యూసర్ గా వెళ్లిన బండ్ల గణేష్ ఒక్కసారిగా సినిమాలకు దూరం అయ్యాడు. చాలా రోజుల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కనిపించదు.. బాగా హాల్ చల్ చేశాడు.. ఖచ్చితంగా గెలుపు మాదే అన్న బండ్ల గణేష్ ఘోరంగా ఓడిపోయాడు.

ఇంకేముంది మళ్లీ మాములు జీవితం.. చేసేదేమి లేక మల్లి సినిమాల్లోకి వచ్చాడు. ఇక అలానే ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి కానుకగా వచ్చిన మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమాలో కమెడియన్ గా చిన్న పాత్ర చేశాడు. అనుకున్నంత పేరు రాలేదు.. అయినా బండ్ల గణేష్ ఇలాంటి పాత్రల్లో నటించడం ఏంటి అని కొందరు కామెంట్లు చేశారు.

దీంతో ఇక మళ్లీ ప్రొడ్యూసర్ అవతారం ఎత్తాడు బండ్ల గణేష్. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమా తీసి బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిన బండ్ల గణేష్ ఇప్పుడు మరో చిత్రాన్ని పవన్ కళ్యాణ్ తో తీయనున్నాడు. ఈ విషయాన్నీ బండ్ల గణేష్ ఏ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. దీంతో ఈ ట్విట్ చుసిన పవన్ అభిమానులు ట్విట్టర్ లో ఆ ట్విట్ ని ట్రెండ్ చేస్తున్నారు.