Pawan Kalyan On Aha: ఈరోజు రాత్రి 9 గంటలకు ఆహా ఓటిటిలో పవన్ కళ్యాణ్ “అన్ స్టాపబుల్” ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆహా టీం సభ్యుల కీలక ప్రకటన చేశారు. విషయంలోకి వెళ్తే ప్రభాస్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ సమయంలో ఆహా యాప్ స్ట్రక్ అయిపోవడం తెలిసిందే. ఒక్కసారిగా సబ్స్క్రైబర్స్… లాగిన్ కావడంతో కొన్ని గంటల పాటు… సర్వర్ డౌన్ అయిపోయింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కి అటువంటి సమస్య రాకుండా ఉంది గానే జాగ్రత్తలు పడినట్లు టీం సభ్యులు పేర్కొన్నారు. ప్రభాస్ ఎపిసోడ్ కంటే రెండింతలు వచ్చే అవకాశం ఉందని దీంతో మూడు గంటలలో రెండు మిలియన్ ల వ్యూయర్స్… హ్యాండిల్ చేసే విధంగా బ్యాకప్ సర్వర్స్ రెడీ చేసినట్లు స్పష్టం చేశారు.
ఈ ఎపిసోడ్ చూడటానికి పవన్ కళ్యాణ్ అభిమానులు మంచి ఆత్రుత మీద ఉన్నారు. పైగా బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్ అని ఆహా మంచి వీడియోలు ప్రోమోలు రిలీజ్ చేయడంతో.. ఉత్సాహంగా ఉన్నారు. ఫస్ట్ టైం బాలయ్య మరియు పవన్ ఒకే వేదికపై కొన్ని గంటలపాటు కూర్చోవడంతోపాటు ఎటువంటి ప్రశ్నలు బాలయ్య అడిగాడు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే రిలీజ్ అయిన వీడియోలలో.. పవన్ కళ్యాణ్ పొలిటికల్ లైఫ్ మరియు ఫ్యామిలీ లైఫ్ ఇంకా మూడు పెళ్లిళ్లు గురించి బాలయ్య ప్రశ్నించారు. అంతేకాదు డైరెక్టర్ త్రివిక్రమ్ తో స్నేహం గురించి కూడా అడగడం జరిగింది.

దీంతో బాలయ్య ప్రశ్నలకు పవన్ ఎటువంటి సమాధానం ఇచ్చాడు అన్నది ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి ఫిబ్రవరి మూడవ తారీకు పవన్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ చేయాలని భావించారు. కానీ అనూహ్యంగా అబిమానులు సోషల్ మీడియాలో ఒకరోజు ముందుగానే చేయాలనీ భారిఎత్తున కంపైన్ చేయడం జరిగింది. దీంతో ఫ్యాన్స్ డిమాండ్ మేరకు ఆహా… రిలీజ్ చేస్తూ ఉండటంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇక ఇదే ఎపిసోడ్ లోకీ మరో మెగా హీరో సాయి ధరం తేజ్ పాల్గొనడం విశేషం.
' @ahavideoIN took care of everything for #PawanKalyan arrival !! They have increased server Threshold to 2M users in 3 hours 🥵🔥#PawanKalyanOnAHA pic.twitter.com/n165jbVeiJ
— SRIKARPOWER ⚡🔔 (@srikar_power) February 2, 2023