హైదరాబాద్: పవన్ కల్యాణ్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు శుభవార్త. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న ‘పింక్’ రీమేక్ విడుదలపై స్పష్టత వచ్చింది. ఈ సినిమాను వేసవి కానుకగా మే 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయతిస్తున్నామని నిర్మాత దిల్ రాజ్ వెల్లడించారు. టైటిల్‌పై ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఉగాది సందర్భంగా టైటిల్‌ను విడుదల చేయాలని అనుకుంటున్నామని చెప్పారు.
నటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకొని కొద్ది నెలలుగా రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్‌కల్యాణ్ అందరు ఆశ్చర్యపోయేలా ఏకంగా మూడు సినిమాలు మొదలు పెట్టారు. బాలీవుడ్లో ఘన విజయం సాధించిన ‘పింక్’ రీమేక్‌లో పవన్ నటిస్తున్నారు. దీంతో పాటు క్రిష్, హరీశ్ శంకర్ సినిమాలు కూడా ఒకే అయిపోయాయి.