Pawan Kalyan: పవన్ కళ్యాణ్ దాదాపు మూడు సంవత్సరాల తర్వాత “వకీల్ సాబ్” సినిమాతో రీ-ఎంట్రీ బాక్స్ ఆఫీస్ దగ్గర అదరగొట్టేసింది. ఊహించని విధంగా సినిమాకి కలెక్షన్లు రావడంతో పాటు ఫస్ట్ డే 50 కోట్ల కలెక్షన్ రావటం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. దీంతో ఇప్పుడు అందరి చూపు “అయ్యప్పనుమ్ కొశీయున్” సినిమాపై పడింది. ఫస్ట్ టైమ్ రానా – పవన్ కళ్యాణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి.
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన వర్కింగ్ వీడియో మరియు తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేసింది అని చెప్పవచ్చు. సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర హైలెట్ గా ఉండటం మాత్రమే కాక రానా పాత్రకి పోటీ గా ఉంటుందని..ఇద్దరి మధ్య సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి అని ఇండస్ట్రీ టాక్. పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్, మాజీ మిలటరీ సైనికుడి పాత్రలో రానా సినిమాలో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఫస్టాఫ్ లో ఓ యాక్షన్ ఎపిసోడ్ హైలెట్ అని తాజాగా ఇండస్ట్రీ నుండి అందుతున్న టాక్.
సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్టంట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ దర్శకత్వంలో ఈ ఫైట్ తెరకెక్కుతోంది. తమిళంలో అజిత్, రజినీకాంత్, సూర్య లాంటి టాప్ హీరోలకు ఫైట్ కంపోజింగ్ చేసే ఈ ఫైట్ మాస్టర్ ఈ…హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ బాహుబలి సినిమాకి మించి ఉండేలా తీస్తున్నాడని..చాలా లాంగ్ యాక్షన్ ఎపిసోడ్ అయినా ఈ సీన్ ఫస్టాఫ్ మొత్తానికి హైలెట్ అని టాక్. తాజాగా ఈ యాక్షన్ ఎపిసోడ్ ఫైట్ లో రానా వర్క్ చేస్తున్నట్లు సమాచారం.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!