Pawan Kalyan : దాదాపు రెండు సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి మళ్లీ సినిమా ఇండస్ట్రీలో ఫుల్ బిజీ అవుతున్నారు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజుల నుండి తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలకంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. గత సార్వత్రిక ఎన్నికలలో మొట్టమొదటి సారి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఓడిపోవడం జరిగింది.
అంతేకాకుండా తన పార్టీ తరఫున కేవలం ఒకే ఒక్క సీటు రావటం అందరికీ తెలిసిందే. అయినా కానీ పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా బిజెపి పార్టీ తో పొత్తు పెట్టుకుని పోరాడుతూ పార్టీని రాణిస్తున్నారు.
Pawan Kalyan : “వకీల్ సాబ్” సినిమాతో
ఇదే క్రమంలో మరో పక్క వరుసపెట్టి సినిమాలు చేస్తూ ఉన్నారు. “వకీల్ సాబ్” సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న పవన్ కళ్యాణ్ …రానాతో మల్టీస్టారర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే రానా తో చేయబోయే మల్టీస్టారర్ సినిమా “వకీల్ సాబ్” తరహాలోనే పాటలు ఉండవట. రెండు సినిమాలలో పాటలు లేకుండా సినిమా షూటింగ్ జరుపుకోనున్నట్లు సరికొత్త టాక్ వినపడుతోంది.
ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ సంగీతం అందించడం విశేషం. చాలా వరకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోనే సినిమా రండి అవుతుందని ఫిలిం వర్గాలు అంటున్నాయి. పవన్ రానా మల్టీస్టారర్ సినిమాకి సంబంధించి షూటింగ్ ప్రస్తుతం చాలా శరవేగంగా సాగుతోంది. అనుకున్న టైం కంటే చాలా త్వరగానే ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెపుతున్నాయి.