Pawan kalyan – Raviteja: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుసగా సినిమాలను కమిటయిన సంగతి తెలిసిందే. సినిమా తర్వాత సినిమాను పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇటీవల రిలీజ్ కావాల్సిన భీమ్లా నాయక్ సినిమా పోస్ట్‌పోన్ అయి ఫిబ్రవరిలో రాబోతోంది. ఇక త్వరలో హరిహర వీరమల్లు చిత్రాన్ని పూర్తి చేసేందుకు
సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తైన ఈ సినిమా మిగతా చిత్రీకరణను పూర్తి చేసేందుకు దర్శకుడు క్రిష్ బృందం షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారట.
ఒకవేళ ఈ సినిమా షూటింగ్ గనక లేట్ అయితే వెంటనే హరీశ్ శంకర్ సినిమా భవదీయుడు భగత్‌సింగ్‌ను మొదలు పెట్టేలా కూడా పవన్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయితే ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌లో ఓ న్యూస్ వచ్చి వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ – మాస్ మహారాజ రవితేజ కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాను చేయనున్నారట. పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. గోపాలా గోపాలా, ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమాను చేస్తున్నారు. ఇందులో రానా హీరోగా నటిస్తున్నారు.
Pawan kalyan – Raviteja: పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించేందుకు ఎస్ చెప్పినట్టు టాక్ వినిపిస్తోంది.
ఈ క్రమంలోనే మరో మల్టీస్టారర్ సినిమాను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. రవితేజ ప్రస్తుతం అరడజను సినిమాలు చేస్తున్నారు. అందులో మెగాస్టార్ చిరంజీవి – బాబీ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలో కూడా తమ్ముడిగా కనిపించబోతున్నారు. అటు మెగాస్టార్ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిన రవితేజ.. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించేందుకు ఎస్ చెప్పినట్టు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమాను ఇప్పటికే పవన్ కళ్యాణ్‌తో సినిమాను నిర్మించి భారీ హిట్ అందుకున్న ఓ ప్రముఖ నిర్మాత నిర్మించనున్నారట. ఇదే గనక నిజమైతే అభిమానులకు పెద్ద పండుగ అని చెప్పాలి.