పవన్ కళ్యాణ్ నటించిన రీమేక్ సినిమాలు ఇవే..!

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి సినీరంగంలో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.తన అన్నయ్య చిరంజీవి ద్వారా సినిమాల్లోకి ఎంటర్ అయిన పవన్ కళ్యాణ్ తన నటన ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా వస్తుందంటే చాలు అభిమానుల ఆనందానికి హద్దు ఉండదు అని చెప్పవచ్చు.పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టగానే తను నటించిన మొదటి ఏడు సినిమాలలో 6 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.

గత కొద్ది సంవత్సరాల క్రితం జనసేన పార్టీని స్థాపించి రాజకీయాలలోకి వెళ్లిన పవన్ కళ్యాణ్ కొంతకాలం వరకు సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే తిరిగి సినిమాలలో రీఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో హిందీలో మంచి విజయం సాధించిన “పింక్”చిత్రాన్ని తెలుగులో “వకీల్ సాబ్” గా తెరకెక్కుతున్న చిత్రంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. అయితే గత 23 ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ సినీ జీవితంలో రీమేక్ చిత్రాలలో నటించిన సినిమాలు ఏమిటో ఇక్కడ చూద్దాం….

గోకులంలో సీత: ‘గోకులతిల్ సీతై’ అనే ఈ సినిమా తమిళంలో మంచి విజయం సాధించడంతో దీనిని తెలుగులో పవన్ కళ్యాణ్, రాసి జంటగా “గోకులంలో సీత”అనే పేరు ద్వారా ముత్యాల సుబ్బయ్య తెరకెక్కించారు.

సుస్వాగతం: పవన్ కళ్యాణ్ సినీ జీవితంలో సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన సుస్వాగతం సినిమా. దేవయాని పవన్ కళ్యాణ్ జంటగా నటించిన ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించింది. ఈ సినిమా కూడా తమిళంలో హిట్ అయినా ‘లవ్ టుడే’ అనే చిత్రానికి రీమేక్ గా నిర్మించినదే.

తమ్ముడు: అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ తమ్ముడు చిత్రం కూడా హిందీ రీమేక్ చిత్రం.‘జో జీత ఓహి సికిందర్’ అని చిత్రానికి రీమేక్ గా తమ్ముడు సినిమా తెరకెక్కించారు.

ఖుషి: పవన్ కళ్యాణ్ జీవితంలో ఆల్ టైం హిట్ సినిమాగా ఖుషి ఒకటి అని చెప్పవచ్చు. ఇంతటి ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని తమిళంలో ఖుషి గా తెరకెక్కిన చిత్రం ఆధారంగా రూపొందించారు.

అన్నవరం: తిరుపచి అనే తమిళ సినిమాకి రీమేక్ గా అన్నవరం సినిమాను దర్శకుడు శ్రీనివాస్ రావు తెరకెక్కించారు.

తీన్ మార్: హిందీలో సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొనే నటించిన “లవ్ ఆజ్ కల్”సినిమా ఆధారంగా తెలుగులో తీన్ మార్ గా రీమేక్ చేశారు.

గబ్బర్ సింగ్: పవన్ కళ్యాణ్ శృతి హాసన్ జంటగా నటించిన గబ్బర్ సింగ్ సినిమా, హిందీలో సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ సినిమా రీమేక్.

గోపాల గోపాల: విక్టరీ వెంకటేష్ పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ గా తీసిన ఈ సినిమా హిందీలో అక్షయ్ కుమార్ నటించిన ఓ మై గాడ్ రీమేక్ చిత్రం.

కాటమరాయుడు: తమిళంలో సూపర్ హిట్ అయిన అజిత్ ‘వీరం’సినిమాకి రీమేక్ చిత్రంగా తెలుగులో కాటమరాయుడు సినిమా దర్శకుడు డాలి తెరకెక్కించారు.

అజ్ఞాతవాసి: పవన్ కళ్యాణ్ కీర్తి సురేష్ జంటగా నటించిన అజ్ఞాతవాసి చిత్రం ఫ్రెంచ్ మూవీ ‘ది లార్గో వించ్’ చిత్రానికి ఇది అనఫిషియల్ రీమేక్.

పింక్: ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న 26 వ చిత్రం క్లబ్ సినిమాను హిందీలో సూపర్ హిట్ సాధించిన పింక్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు.


Share

Related posts

బిగ్ బాస్ 4 : “తల్లీ నీకు దణ్ణం పెడతా” అని అరియానాకు వేడుకున్న అఖిల్..!

arun kanna

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ షో కంటెస్టెంట్ సన్నీ గురించి ఎవరికీ తెలియని వాస్తవాలు..!!

sekhar

Sufficient Food: మీరు తక్కువగా తింటున్నారడానికి సూచనలు ఇవే..!!

bharani jella