NewsOrbit
Entertainment News సినిమా

BRO: పవన్ కళ్యాణ్… సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ చిత్రం అప్ డేట్ వచ్చేసింది..!!

Share

BRO: పవన్ కళ్యాణ్… సాయి ధరమ్ తేజ్ కలసి ఫస్ట్ టైం మల్టీస్టారర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని సముద్రఖని డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా ఈరోజు సాయంత్రం ఈ సినిమా టైటిల్ “బ్రో” అని ప్రకటించడం జరిగింది. తమిళంలో “వినోదయ సీతం” గా తెరకెక్కిన ఈ సినిమాని తెలుగులో “బ్రో” గా రీమేక్ చేయడం జరిగింది. ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో… పవన్ కళ్యాణ్ టాకీ పార్ట్ చాలా త్వరగా ముందుగానే కంప్లీట్ చేయడం జరిగింది. సగభాగం మాత్రమే పవన్ సినిమాలో కనిపించనున్నారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ఇంకా మిగతా బ్యాలెన్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

Pawan Kalyan Sai Dharam Tej multistarrer movie update is here

మోషన్ పోస్టర్ తో కూడిన టైటిల్ ప్రకటనకి తమన్ అందించిన మ్యూజిక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. పోస్టర్ లో పవన్ లుక్స్ కూడా చాలా స్టైలిష్ గా కనిపిస్తోంది. దీంతో సినిమా పై మరింత క్యూరియాసిటీ పెరిగింది. కాగా సముద్రఖని గతంలో తెలుగులో మూడు సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఆ సినిమాలు కమర్షియల్ గా పెద్ద హిట్టు అందుకోలేకపోయిన కథ పరంగా ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. దర్శకత్వ పరంగా గతంలో పెద్దగా ఆకట్టుకొని సముద్రఖని…ఈ “బ్రో” సినిమాతో ఏ మేరకు అభిమానులను ఆకట్టుకుంటాడో చూడాలి. జులై 28వ తారీకు ఈ సినిమా విడుదల చేయనున్నారు.

Pawan Kalyan Sai Dharam Tej multistarrer movie update is here

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. కేతిక శర్మ, ప్రియా వారియర్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తుంది.  ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ మెగా హీరోతో మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాపై భార్య అంచనాలను నెలకొన్నాయి. సినిమాలో సగభాగం మాత్రమే పవన్ ఉన్నా గానీ… చాలా పవర్ ఫుల్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. జూలైలో సినిమా విడుదల నేపథ్యంలో జూన్ నెల నుండి ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉందట.

 


Share

Related posts

Acharya: సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ చిరంజీవి “ఆచార్య” పై వైరల్ కామెంట్స్..!!

sekhar

Suhasini: ప్రముఖ సీనియర్ హీరోయిన్ సుహాసిని తన భర్త మణిరత్నం దర్శకత్వంలో సినిమాలు అందుకే చేయడం లేదు

GRK

బన్ని, సుక్కు .. హ్యాట్రిక్

Siva Prasad