OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో OG అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినట్లు.. మేకర్స్ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో స్టోరీ కోసం డైరెక్టర్ ఎంత కష్టపడ్డారు అన్నది చూపించడం జరిగింది. చాలావరకు గన్స్ తో పాటు బాంబులు.. ఒక సైకలాజికల్ ఆఫీసర్.. జేమ్స్ బాండ్ కథ తరహా మాదిరిగా స్టోరీ రూపొందించినట్లు తెలుస్తోంది. ఒకపక్క టైప్ రైటింగ్ మరోపక్క స్టోరీ రైటింగ్ అన్నీ కూడా చూపిస్తూ.. చివరిలో పవన్ కళ్యాణ్ ఫోటో కనుబొమ్మ చూపించి వచ్చే వారంలో.. పవన్ కళ్యాణ్ షూటింగ్ లో జాయిన్ అవబోతున్నట్లు తెలిపారు.
“OG” తాజా అప్ డేట్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఫైర్ స్టార్మ్ కామింగ్ అంటూ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తమన్ సంగీతం అదరగొట్టింది. డివివి దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నరు. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ముంబైలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. పవన్ కళ్యాణ్ కి జోడిగా ప్రియాంక అరుల్ మోహన్ ఈ షెడ్యూల్ లో పాల్గొంటారని తెలుస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస పెట్టి సినిమాలు చేస్తున్న హీరోలలో పవన్ కళ్యాణ్ చేరారు.
ఒకపక్క హరిష్ శంకర్ సినిమా చేస్తున్న ఇప్పుడు .. OG సినిమా కూడా స్టార్ట్ చేయడం జరిగింది. రెండు సినిమాలు కూడా ఈ ఏడాదిలోనే కంప్లీట్ చేసి.. ఒకటి దసరాకి మరొకటి.. సంక్రాంతి పండుగకు విడుదల చేసే ఆలోచనలో పవన్ ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలకు సర్వం సిద్ధమయ్యేలా… ఈ ఏడాదిలోనే చేతిలో ఉన్న ప్రాజెక్టులు అన్నీ పవన్ కంప్లీట్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో పవన్ నీ ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఏ దర్శకుడు చూపించని విధంగా సుజిత్… సరికొత్తగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. మరోపక్క ఇది చాలా తక్కువ టైంలో కంప్లీట్ అయ్యేలా పగడ్బందీగా షెడ్యూల్ కూడా ప్రిపేర్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.