Pawan Kalyan On Aha: తెలుగు ఓటిటి రంగంలో ఆహా ఓ సంచలనం. అతి తక్కువ కాలంలోనే ఆహా అద్భుతమైన క్రేజ్ సంపాదించి… ప్రేక్షకులను అలరిస్తోంది. బాలకృష్ణ హోస్ట్ గా “అన్ స్టాపబుల్” ఎపిసోడ్ విపరీతమైన క్రేజ్ ఈ ఓటీటీకి తీసుకురావడం జరిగింది. ఈ టాకీ షో దేశంలోనే నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది. సీజన్ వన్ ఎంతగా ఆకట్టుకుందో ఇప్పుడు సీజన్ 2 అంతకుమించి అన్న తరహాలో రికార్డు స్థాయి వ్యూస్ రాబడుతున్నాయి. సెకండ్ సీజన్ లో చాలామంది రాజకీయ నాయకులు సినిమా సెలబ్రిటీలు రావడం తెలిసిందే. ఈ క్రమంలో సినిమా సెలబ్రిటీలలో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఎపిసోడ్ అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది.

అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుంది అన్నది సంచలనంగా మారింది. పవన్ “అన్ స్టాపబుల్” ఎపిసోడ్ షూటింగ్.. గత ఏడాది డిసెంబర్ నెలలోనే కంప్లీట్ అయింది. అయితే సంక్రాంతికి ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుందని భావించగా ఫిబ్రవరి మూడో తారీకు అని మొదటి ప్రోమోలో చూపించారు. కానీ ముందుగానే రిలీజ్ చేయాలని అభిమానులు కోరడంతో ఫిబ్రవరి 2వ తారీఖు రాత్రి 9 గంటలకు స్ట్రీమింగ్ చేస్తున్నట్లు.. ఆహా టీం వెల్లడించింది. ఇదిలా ఉంటే ఈ ఎపిసోడ్ పార్ట్ 1ను ప్రసాద్ ల్యాబ్స్ లో ఈరోజు సాయంత్రం స్క్రీనింగ్ చేయనున్నారట. పవన్ క్రేజ్ క్యాష్ చేసుకునే దిశగా ప్రసాద్ థియేటర్ యాజమాన్యం ఈ ప్లాన్ చేసినట్లు సమాచారం.

పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయిందంటే థియేటర్ వద్ద ఏటువంటి వాతావరణం ఉంటుందో అందరికీ తెలుసు. ఈ క్రమంలో పవన్ “అన్ స్టాపబుల్” ఎపిసోడ్ సినిమా ధియేటర్ లో ఫస్ట్ టైం ప్రదర్శించటం.. సంచలనంగా మారింది. ఈ ఎపిసోడ్ లో బాలయ్య.. పవన్ ఇద్దరు కూడా మంచి జోష్ మీద ప్రోమోలలో కనిపించారు. సినిమా, రాజకీయ అదేవిధంగా కుటుంబం గురించి బాలయ్య.. పవన్ ని అడిగిన ప్రశ్నలు కూడా షోపై ఆసక్తిని పెంచుతున్నాయి. మరి కొద్ది గంటల్లో స్ట్రీమింగ్ కానున్న ఈ షో ఏటువంటి అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.