Unstoppable 2: ఆహా ఓటీటీలో పవన్ కళ్యాణ్ “అన్ స్టాపబుల్” ఎపిసోడ్ నిన్నటి నుండి స్క్రీనింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆహా టీం పవన్ ఎపిసోడ్ అన్ని రికార్డులను బ్రేక్ చేసినట్లు అధికారిక ప్రకటన చేయడం జరిగింది. పవన్ “అన్ స్టాపబుల్” పార్ట్ 1 ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయిన 14 గంటల్లోనే 100 మిలియన్ ల మినిట్స్ పూర్తయినట్లు … దీంతో అన్ని రికార్డులను బ్రేక్ చేయడం జరిగిందని అధికారిక ప్రకటన చేసింది. పవన్ బ్లాక్ చొక్కా వేసుకున్నాడు అంటే బొమ్మ బ్లాక్ బస్టర్ అని ట్వీట్ చేయడం జరిగింది. ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ చాలా సరదా ప్రశ్నలతో పాటు కొన్ని కాంట్రవర్సీ ప్రశ్నలు కూడా వేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా విమర్శించే ప్రత్యర్థులు ఎక్కువగా మూడు పెళ్లిళ్లు ప్రస్తావన తీసుకోవడం తెలిసిందే.

ఈ విషయాన్ని గురించి పవన్ ని.. మూడు పెళ్లిళ్ల గోలేటి భయ్యా అని బాలకృష్ణ అడిగిన దానికి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఒకేసారి మూడు పెళ్లిళ్లు చేసుకోలేదని ఒకరితో కుదరకపోతే విడాకులు ఇచ్చి.. మరొకరిని పెళ్లి చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సమాధానంతో ఈసారి మూడు పెళ్లిళ్లు అని ఎదవ వాగుడు వాగే వాళ్ళు ఊర కుక్కతో సమానమంటూ బాలకృష్ణ కూడా తనదైన శైలిలో పవన్ వ్యాఖ్యలతో ఏకీభవించారు. ఇక ఇదే సమయంలో ఈ సీజన్ కి పవన్ కళ్యాణ్ ఇదే ఫైనల్ ఎపిసోడ్ అని బాలయ్య క్లారిటీ ఇచ్చారు. ఎపిసోడ్ మధ్యలో మరో మెగా హీరో సాయిధరమ్ తేజ్ కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ కి గురికావడం పట్ల అంతగా స్పందించడానికి కారణం కొంత మీడియా చేసిన అతి అని పవన్ వ్యాఖ్యానించారు. అంత మాత్రమే కాదు దాదాపు చావు బతుకుల మధ్య దాకా వెళ్ళటంతో తాను రంగంలోకి దిగాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.
ఇంకా ఈ ఎపిసోడ్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో స్నేహం గురించి అనేక విషయాలు తెలియజేయడం జరిగింది. స్నేహితుడిగా కంటే తన గురువుగా త్రివిక్రమ్ నీ భావిస్తానని పవన్ వ్యాఖ్యానించారు. ఇంకా అత్తనా బాల్యం గురించి చిరంజీవి పిల్లలను పెంచడం తోపాటు.. సినిమా రంగంలో ప్రవేశించటం వంటి విషయాలపై ఈ ఎపిసోడ్ లో పవన్ కొత్త విషయాలు తెలియజేశారు. చిన్నతనంలో తనకి ఆస్తమా ఉండటంతో శారీరకంగా మేక బాధలు ఎదుర్కోవటం జరిగిందని ఆ టైంలో చనిపోవాలని అన్నయ్య చిరంజీవి గదిలో రివాల్వర్ కూడా తీసుకొని షూట్ చేసుకుందాం అనుకున్నా అని పవన్ చెబుతున్న టైములో కరెక్ట్ గా ఎపిసోడ్ ముగిసింది. దీంతో రెండో ఎపిసోడ్ కోసం అభిమానులు ఉత్కంఠ భరితంగా ఉన్నారు.