NewsOrbit
Entertainment News సినిమా

Bhagwant Kesari: బాలకృష్ణ “భగవంత్ కేసరి” ప్రీ రిలీజ్ వేడుకకి పవన్ కళ్యాణ్ చీఫ్ గేస్ట్..!!

Share

Bhagwant Kesari: నటసింహం నందమూరి బాలయ్య బాబు కొత్త సినిమా “భగవంత్ కేసరి” అక్టోబర్ 20వ తారీకు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దసరా పండుగ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి సంబంధించి టీజర్ విడుదల కార్యక్రమం ఇటీవల వరంగల్ లో జరిగింది. అభిమానుల మధ్య జరిగిన ఈ కార్యక్రమం విజయవంతం కావడం జరిగింది. తెలంగాణ యాసలో టీజర్ లో బాలయ్య డైలాగులు అగరగొట్టాయి. బాలకృష్ణ కూతురిగా శ్రీలీల నటిస్తోంది. కూతురిని ఆర్మీకి పంపించాలని తండ్రి పడే తపన.. ఈ క్రమంలో శ్రీ లీలనీ దానికి తగ్గ తర్ఫీదు ఇస్తూ బాలకృష్ణ వ్యవహరించడం చివరకి ఆర్మీకి వెళ్లకూడదని.. నావల్ల కాదు అంటూ టీజర్ లో శ్రీలీలా డైలాగులు చెప్పడం సినిమా కథపై చూసే ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ కలిగింది.

Pawan Kalyan was the chief guest at Balakrishna Bhagwant Kesari pre release event

ఈ క్రమంలో అర్జున్ రాంపాల్ విలన్ బాలకృష్ణ కూతురిని చంపడానికి ప్రయత్నాలు చేయటం వంటివి చూపించి.. సస్పెన్స్ క్రియేట్ చేశారు. “భగవంత్ కేసరి” టీజర్ కి అభిమానుల నుండి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. సరిగ్గా ఈ సినిమా విడుదలయ్యే రోజు రవితేజ కొత్త సినిమా “టైగర్ నాగేశ్వరరావు” తమిళ సినిమా “లియో” విడుదలవుతున్నాయి. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో త్వరలో భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాబోతున్నారని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకోవడం తెలిసిందే.

Pawan Kalyan was the chief guest at Balakrishna Bhagwant Kesari pre release event

వచ్చే ఎన్నికలలో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని స్వయంగా పవన్ ప్రకటించారు. అందుకే బాలయ్య సినిమాకి పవన్ కళ్యాణ్ తన స్నేహ హస్తం అందిస్తున్నట్లు టాక్. ఆల్రెడీ ఈ ఇద్దరు గతంలో “అన్ స్తాపబుల్” షోలో పాల్గొన్నారు. రెండో సీజన్ లో వచ్చిన పవన్ కళ్యాణ్ ని బాలకృష్ణ రాజకీయ మరియు సినిమా రంగానికి సంబంధించి వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎన్నో ప్రశ్నలు వేశారు. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ రికార్డు స్థాయి వ్యూస్ రాబట్టింది. ఈ క్రమంలో మరోసారి ఈ ఇద్దరు హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.


Share

Related posts

పవన్-రానా మూవీకి నాటి చిరు-మోహన్ బాబు సినిమా మాస్ టైటిల్..!!

Muraliak

Mahesh: మహేశ్ ఫ్యాన్స్..మీకు బంగారం శుభవార్త…

GRK

మెగా హీరోతో త్రివిక్రమ్ సెన్సేషనల్ ప్రాజెక్ట్..??

sekhar