Akira Pawan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ మొన్ననే 18వ యేట లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. 18 సంవత్సరాలు నిండగానే ముందుగా రక్తదానం చేసి.. తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకున్న అకిరా నందన్ తాజాగా స్కూల్ లో మే 23 వ తారీకు తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకోవడం జరిగింది. కొడుకు గ్రాడ్యుయేషన్ పూర్తి కావడంతో తండ్రి పవన్ కళ్యాణ్.. అకీరా నందన్ స్కూల్ లో.. సందడి చేశారు. తల్లి రేణు దేశాయ్, చెల్లి ఆద్య తో పాటు పవన్ కళ్యాణ్ రావడంతో.. అకీరా నందన్ ఫోటో లకు సంతోషంగా ఫోజులు ఇచ్చాడు.
పవన్.. రేణు దేశాయ్ విడాకులు తీసుకున్న తర్వాత పిల్లలిద్దరూ రేణు సంరక్షణలోనే పెరుగుతున్న సంగతి తెలిసిందే. అడపాదడపా పవన్ అప్పుడప్పుడు పిల్లలను చూస్తూ వస్తుంటారు. ఇక ఇదే సమయంలో రేణు దేశాయ్ తన దగ్గర పిల్లలు ఉన్నాగానీ మెగా ఫ్యామిలీ కి దూరం పెట్టకుండా… ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి.. మెగా కుటుంబంలో జరిగే కొన్ని కార్యక్రమాలకు పిల్లలను పంపిస్తూ వస్తుంటుంది. ఈ రీతిగా పిల్లలకి తండ్రికి మధ్య దూరం ఏమాత్రం రాకుండా రేణుదేశాయ్ ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూనే ఉంటది.
దీంతో కొడుకు అకీరా నందన్ గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ కి పవన్ రావడం జరిగింది. ఈ సందర్భంగా మళ్లీ చాలా కాలం తర్వాత తన ఫ్యామిలీతో పవన్ కళ్యాణ్ ఫోటోలకి ఫోజులు ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నయి. ఇక ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ అభిమానులు అఖిరా నందన్ గ్రాడ్యుయేషన్ సందర్భంగా ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ గ్రాడ్యుయేషన్ డే అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సందడి చేశారు. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్, అఖిరా నందన్, ఆద్య.. కలసి ఫోటో దిగటంతో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…
Hero Ram: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీటలెక్కబోతున్నాడంటూ గత కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…
AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…
Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…
Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…
Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…