NewsOrbit
Entertainment News సినిమా

Pawan Kalyan: అప్పుడే ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న పవన్ కళ్యాణ్ క్రేజీ ప్రాజెక్ట్..!!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంచి స్పీడ్ మీద ఉన్నారు. ఇండస్ట్రీలో ఏ హీరో చేయని రీతిలో వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరొక రాజకీయాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే వారాహి వాహనం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేయాల్సిన పవన్ కొన్ని కారణాలవల్ల వాయిదా వేసుకోవటం జరిగింది. కానీ అడపాదడబా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ సమావేశాలు నిర్వహిస్తూ.. వచ్చే ఎన్నికలకు అన్ని రకాలుగా సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం హరిష్ శంకర్ దర్శకత్వంలో “ఉస్తాద్ భగత్ సింగ్”… ఆ తర్వాత సుజిత్ దర్శకత్వంలో “OG” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Pawan Kalyan's crazy project which has just completed a schedule

ఈ రెండు సినిమాలలో ఉస్తాద్ భగత్ సింగ్”… క్రేజీ ప్రాజెక్టు గా తేరకెక్కుతోంది. ఎందుకంటే గతంలో హరీష్ దర్శకత్వంలో వచ్చిన “గబ్బర్ సింగ్” సూపర్ డూపర్ హిట్ కావడమే. పైగా హరీష్ పవన్ కళ్యాణ్ అభిమాని. “గబ్బర్ సింగ్” చేస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ వరుసపరాజయాలు ఎదుర్కొంటున్నారు. దాదాపు పది సంవత్సరాలు సరైన హిట్టు పడలేదు. “ఖుషి” తర్వాత ఆ స్థాయి హిట్ “గబ్బర్ సింగ్” రూపంలో పడింది. ఈ సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పవన్ కళ్యాణ్ అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. దీంతో హరీష్ పై పవన్ ఫ్యాన్స్ కి ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది.

Pawan Kalyan's crazy project which has just completed a schedule

వాస్తవానికి ఈ సినిమా ప్రకటన చేయకముందు… “భగత్ సింగ్ బావదీయుడు” అనే సినిమా ప్రకటన 2021లో చేశారు. కానీ ఆ ప్రాజెక్ట్ పక్కనపెట్టి “ఉస్తాద్ భగత్ సింగ్” తెర పైకి తీసుకురావడం జరిగింది. ఈ సినిమాలో పవన్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తూ ఉండటంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. అయితే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. అయితే ఇంతలోనే మొదటి షెడ్యూల్ కంప్లీట్ అయినట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. స్టంట్ డైరెక్టర్స్ రామ్ లక్ష్మణ్ పర్యవేక్షణలో ఎనిమిది రోజులపాటు పవన్ పై భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించినట్లు తెలిపారు. ఇదే సమయంలో యంగ్ హీరోయిన్ శ్రీలీలతో రొమాంటిక్ సీన్స్… పిల్లలతో కామెడీ సన్నివేశాలను తేరాకెక్కించినట్లు స్పష్టం చేశారు. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Related posts

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri