25.7 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Unstoppable 2: పెళ్లి అంశంపై “అన్ స్టాపబుల్” ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు..!!

Share

Unstoppable 2: ఫిబ్రవరి 2వ తారీఖు ఆహా ఓటీటీలో రిలీజ్ అయిన పవన్ “అన్ స్టాపబుల్” పార్ట్ వన్ ఎపిసోడ్ రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంది. 24 గంటల్లోనే పలు రికార్డులను బ్రేక్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం బాలకృష్ణ మరియు పవన్ కళ్యాణ్ ఒకే ఫ్రేమ్ లో గంటన్నర పాటు కనిపించడంతో.. నందమూరి మరియు మెగా ఫ్యాన్స్.. ఈ ఎపిసోడ్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా పవన్ నీ బాలయ్య భయ్యా అని సంబోధించడం చాలా కొత్తగా అనిపించింది. షోలో పవన్ ఎంట్రీ ఇచ్చిన నాటినుండి బాలయ్య నవ్విస్తూనే చాలా అద్భుతంగా ఎపిసోడ్ నీ ప్రేక్షకులకీ నచ్చేలా… చేయడం జరిగింది.

Pawan Kalyan's interesting comments on the topic of marriage in unstoppable

అంతేకాదు పవన్ కళ్యాణ్ జీవితంలో కొత్త కోణానికి సంబంధించి అనేక విషయాలు కూడా ఈ షోలో అడిగారు. అయితే మూడు పెళ్లిళ్ల ప్రస్తావన వచ్చిన సమయంలో.. పవన్ కళ్యాణ్ పెళ్లి గురించి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. వాస్తవానికి తాను చిన్ననాటి నుండే యోగ మరియు భక్తి మార్గంలో నడుచుకునే మనస్తత్వం కలిగిన వ్యక్తినని పవన్ తెలిపారు. దీంతో పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండాలని… కొత్త బిజినెస్ చేసుకుని సేవా కార్యక్రమాలు ఏదైనా చేయాలన్న ఆలోచనతో ఉన్నట్లు .. పెళ్లి మీద తనకి ధ్యాస లేనట్లు పవన్ చెప్పారు. కానీ ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం మేరకు మొదటి పెళ్లి చేసుకోవటం తర్వాత కుదరకపోవడం… విడాకులు తీసుకోవడం అలా.. అనుకోకుండా పెళ్లి జీవితం అలా అయ్యింది అని పవన్ తెలిపారు.

Pawan Kalyan's interesting comments on the topic of marriage in unstoppable

నాకు కుదరలేదు కాబట్టి.. మూడు పెళ్లిళ్లు చేసుకోవలసి వచ్చిందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో తనని ఉద్దేశించి ప్రత్యర్థులు మూడు పెళ్లిళ్లు అంటూ చేసే కామెంట్స్.. పెద్దగా పట్టించుకోనని పవన్ అన్నారు. వాళ్లకి ఏదీ దొరకక పెళ్లి ప్రస్తావన తీసుకొస్తారు. నేను పోనీలే అని వదిలేస్తాను. వాళ్ల వ్యక్తిగత జీవితాలు గురించి మాట్లాడాలి అని అనిపిస్తే నాకు నా సంస్కారం అడ్డు వస్తది. అందుకే నేను పెద్దగా పట్టించుకోను.. అని పవన్ స్పష్టం చేశారు. అసలు పెళ్లే చేసుకోవాలని.. తనకు ఆలోచన లేదని పవన్ వ్యాఖ్యానించడం.. అభిమానులకు కొత్తగా అనిపించింది.


Share

Related posts

అందుకోసం కియారా అద్వానీ మొత్తం మారాల్సి వచ్చిందా ..?

GRK

Devisriprasad: పవన్ కళ్యాణ్ పేరు చెప్పినా కాంప్రైజ్ కానంటున్న దేవిశ్రీప్రసాద్..అనవసరంగా మిస్ చేసుకుంటాడా..?

GRK

Allu Arjun: జులై ఫస్ట్ వీక్ లో అల్లు అర్జున్ తో పాటు రష్మిక మందన.??

sekhar