Jalsa: సెప్టెంబర్ రెండవ తారీకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నేపథ్యంలో భారీ ఎత్తున వేడుకలు జరిగాయి. ఒకపక్క రాజకీయంగా మరో పక్క సినిమా పరంగా రెండు రంగాలలో ఉన్న ప్రముఖులు పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక అభిమానులు సైతం రకరకాల సహాయ కార్యక్రమాలు చేపట్టారు. మెగా ఫ్యామిలీ హీరోలతో పాటు సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలామంది హీరోలు విషెస్ తెలియజేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఆగస్టు 31 వ తారీకు నుండే పవన్ బర్త్ డే వేడుకలు జరగడం తెలిసిందే.
Pawan Kalyan: పవన్ కల్యాణ్ కూడా నరేష్ లాంటి వాడే.. నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్..!
Pawan Kalyan: ఉరుకులు పరుగులు పెడుతున్న పవన్ దర్శకులు, నిర్మాతలు..??
ఆగస్టు 31వ తారీకు నాడు పవన్ నటించిన సినిమా “తమ్ముడు” లేటెస్ట్ టెక్నాలజీతో స్పెషల్ షోలు వేయడం జరిగింది. భారీ ఎత్తున అభిమానులు ఎంజాయ్ చేశారు. ఇక పవన్ పుట్టినరోజు నేపథ్యంలో పవన్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ “జల్సా” ఫోర్ కే ప్రింట్ తో… విడుదల చేయటం తెలిసిందే. కాగా భారతదేశంలో రీ రిలీజ్ సినిమాకి సంబంధించి అత్యధిక షోలు ప్రదర్శితమైన సినిమాగా “జల్సా” సరికొత్త రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 702 షోలకు పైగా ప్రదర్శనమైతే అన్ని చోట్ల కూడా థియేటర్ లు హౌస్ ఫుల్ కావటం విశేషం.
2008వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. త్రివిక్రమ్ దర్శకుడిగా రూపొందిన ఈ సినిమా ఆ టైంలో వరుస పరాజయాలలో ఉన్న పవన్ కి మంచి ఊరట కలిగించింది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం మరియు పాటలు సినిమాకి హైలైట్ గా నిలిచాయి. దాదాపు మళ్లీ 14 సంవత్సరాల తర్వాత పవన్ బర్తడే నాడు లేటెస్ట్ టెక్నాలజీతో రీ రిలీజ్ అయిన “జల్సా” థియేటర్ లలో ఫుల్ సందడి చేయడం జరిగింది.