పవన్ కళ్యాణ్ – క్రిష్ సినిమా విషయం లో భారీ అప్డేట్ – ఫ్యాన్స్ కి డాన్సులే..!

Share

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు యువ‌త‌లో ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఆయ‌న ఒక హీరో మాత్రమే కాదు. ఒక మంచి మ‌నిషి కూడా.. అలాంటి వ్య‌క్తి సినిమా వ‌స్తుందంటే తెలుగు సినీ ప్రేమికుల‌కు పండ‌గే. ఇప్పుడు ఆయ‌న అర డ‌జ‌న్ సినిమాల‌కు పైగా క‌మిట్ అయ్యార‌ని స‌మాచారం. ఇది విన్న ఆయ‌న ఫ్యాన్స్ ఎగిరి గంతులేస్తున్నారు. అవ‌న్నీ కూడా చాలా వేరియేష‌న్స్ తో రాబోతున్న‌య‌ట‌. ఇప్ప‌టికే వీటిపై ఎన్నో వార్త‌లు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

ఇందులో ముఖ్య‌మైన వార్త .. ప‌వ‌న్ క‌ళ్యాన్ తొలిసారిగా రెండు సినిమాల‌ను ఒకేసారి చేస్తున్నార‌ని స‌మాచారం. అందులో ఒక‌టి అయ్యప్పనుం కోషియం అనే మ‌ల‌యాళం సినిమా రీమేక్, మ‌రోటి డైన‌మిక్ డైరెక్టర్ క్రిష్ తో చేస్తున్న హిస్టారికల్ బ్యాక్ గ్రౌండ్ మూవీ. ఈ రెండు సినిమాల‌ను ఒకేసారి పూర్తి చేయాల‌ని ప‌వ‌న్ చూస్తున్నాడ‌ని తెలుస్తోంది.

డెబ్బై రోజుల్లో నే గౌతమి పుత్ర శాతకర్ణి మూవీని డైన‌మిక్ డైరెక్ట‌ర్ క్రిష్ కంప్లీట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసిన సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ప‌వ‌న్ తో కూడా అలాగే తీస్తారా అనేది వేచి చూడాలి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో తీస్తున్న చిత్రం హిస్టారికల్ మూవీ అని స‌మాచారం.

ఇందులో పవన్ రాజుల కాలం నాటి పాత్రలో కనిపించ‌బోతున్నార‌ని టాక్. ఇప్పటికే ఈ సినిమాలోని ఒక పాటను క్రిష్ కంప్లీట్ చేశాడ‌ట‌. రెండో పాటను కూడా త్వ‌ర‌లోనే షూట్ చేయ‌నున్నాడ‌ని స‌మాచారం. పాట‌ల‌తో సినిమాని స్టార్ట్ చేసి త‌ర్వాత సీన్లకు పోనున్నాడ‌ని తెలుస్తోంది. ఈ ఏడాదిలో నే ఈ మూవీని విడుద‌ల చేయాల‌ని డైరెక్ట‌ర్ క్రిష్ చూస్తున్నాడ‌ట‌.


Share

Related posts

బిగ్ బాస్ 4 : బిగ్ బాస్ సాక్షిగా బయటపడ్డ మెహబూబ్ నిజస్వరూపం…! 

arun kanna

ఆ లోపు కుర్రహీరో ని లైన్ లో పెట్టిన త్రివిక్రమ్..??

sekhar

Bigg Boss Harika : బిగ్ బాస్ హారిక నటించిన ‘ఏవండోయ్ ఓనర్ గారు’ వెబ్ సిరీస్ ట్రైలర్ చూశారా?

Varun G