Pawan Kalyan: సీనియర్ దర్శకులు కళాతపస్వి కె. విశ్వనాథ్ ఇటీవల తుది శ్వాస విడవటం తెలిసిందే. భారతీయ సంస్కృతిక సాంప్రదాయాలను ప్రతిబింబించే చిత్రాలతో కళా నైపుణ్యం కలిగిన కంటెంట్ కలిగిన కథలతో విశ్వనాథ్ సినిమాలు ఉండేవి. దర్శకుడిగా దాదాపు 50 కి పైగా సినిమాలు చేసిన ఆయన నటుడిగా కూడా రాణించారు. కానీ ఇటీవల వయసు మీద పడటంతో కొన్ని అనారోగ్యాల కారణంగా అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస గడవడం జరిగింది. విశ్వనాధ్ మరణం పట్ల ప్రధాని మోడీతో పాటు బాలీవుడ్ ఇంకా సౌత్ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన చాలామంది సినీ నటులు టాప్ హీరోలు స్పందించి సంతాపం తెలిపారు. విశ్వనాథ్ దర్శకత్వంలో నటించిన చాలామంది నటీనటులు ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో మంచి పేరు సంపాదించుకుంటూ రాణిస్తున్నారు.
ఇదిలా ఉంటే విశ్వనాథ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా సినిమా చేయడం జరిగిందట. “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” పవన్ కళ్యాణ్ మొదటి సినిమా. ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో ఈ సినిమా రావడం జరిగింది. చిరంజీవి తమ్ముడిగా హీరోగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో… ఎంట్రీ ఇచ్చి .. ప్రస్తుతం టాప్ హీరోగా పవర్ స్టార్ గా చలామణి అవుతున్నారు. అయితే ఈ సినిమా రాకముందు విశ్వనాథ్ గారి దర్శకత్వంలో చిరంజీవి నటించిన “శుభలేఖ”లో పవన్ వాయిస్ ఇవ్వటం జరిగింది అంట. విషయంలోకి వెళ్తే అప్పట్లో మద్రాసులో ఉన్న సమయంలో 1982 లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో విడుదలైన సాంఘిక చిత్రం “శుభలేఖ” చేయడం జరిగిందంట.
అయితే ఈ సినిమాకి డబ్బింగ్ స్టూడియో చిరంజీవి ఇంటి దగ్గరలోనే ఉండేదట. ఈ క్రమంలో చిరంజీవి స్టుడియోలో డబ్బింగ్ చెబుతూ ఉంటున్న క్రమంలో… అన్నయ్యకి టీ అందించడానికి స్కూల్ నుండి పవన్ వచ్చి టీ ఇస్తున్న సమయంలో విశ్వనాధ్ గారు పవన్ చూసి సినిమాలో చిన్నపాటి పాత్రకు వాయిస్ ఇచ్చేలా బలవంతం చేయడంతో… గొంతు కలపడం జరిగిందంట. ఆ రీతిగా పవన్ కళ్యాణ్.. కళాతపస్వి విశ్వనాధ్ గారి ఆధ్వర్యంలో పవన్ సినిమా ఎంట్రీ ఇచ్చినట్లు కొత్త వార్త ఇప్పుడు బయటపడింది. ఇదిలా ఉంటే విశ్వనాధ్ గారు మరణించిన సమయంలో స్వయంగా పవన్ కళ్యాణ్.. డైరెక్టర్ త్రివిక్రమ్ తో కలిసి.. ఆయన భౌతిక కాయానికి నివాళులు కూడా అర్పించడం జరిగింది. సినిమా ఇండస్ట్రీ మూలస్థంభం కోల్పోయిందని పవన్ మీడియా దగ్గర ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో పవన్ ఎంట్రీ ఇచ్చినట్లు వార్త బయటపడటంతో ఆయన బ్లెస్సింగ్ పవన్ కళ్యాణ్ కీ కూడా ఉంది అని నేటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.