మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ క్రమంలో ఎప్పటికీ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న “బోలాశంకర్”, “గాడ్ ఫాదర్” సినిమాలకు సంబంధించి విడుదల తేదీలు అధికారికంగా ప్రకటించటం జరిగింది. ఈ తరుణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న “హరిహర వీరమల్లు” సినిమా విడుదల తేదీ అనూహ్యంగా సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించడం సంచలనం రేపింది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 29వ తారీకు రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో పవన్ మూడు విభిన్నమైన పాత్రలలో కనిపిస్తున్నట్లు సమాచారం.
ఫస్ట్ టైం పౌరాణిక నేపథ్యంలో మొగలుల సామ్రాజ్యం కాలం నాటి చారిత్రాత్మకమైన కథతో పవన్ ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉండటంతో “హరిహర వీరమల్లు” సినిమాపై అంచనాలు భారీ ఎత్తున ఉన్నాయి. ఈ సినిమాలో పాతకాలం నాటి యుద్ధ విద్యలు తరహాలో పోరాట సన్నివేశాలు డైరెక్టర్ క్రిష్ తెరకేకిస్తున్నారు. ఇందుకోసం పవన్ స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకోవడం జరిగింది. రాజుల కాలం నాటి యుద్ధాలు గుర్రపు స్వారీ లలో పవన్ కళ్యాణ్… ఈ సినిమాలో ఫైట్స్ చేసినట్లు సమాచారం. “ఖుషి” డైరెక్టర్ ఏఎం రత్నం ఈ సినిమాకి నిర్మాత కావడంతో.. అభిమానులకు మరింత ఇంట్రెస్ట్ నెలకొంది.
చిరంజీవి పుట్టినరోజు నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కొత్త సినిమా విడుదల తేదీ కూడా రావటంతో… ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. ఇక అదే సమయానికి ఏప్రిల్ 28వ తారీకు త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ లో సినిమా విడుదల కానుంది. ఒక్క రోజు వ్యవధిలో ఒకపక్క మహేష్ మరో పక్క పవన్ సినిమా రిలీజ్ అవుతున్న తరుణంలో వచ్చే సమ్మర్ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ నెలకొంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!