25.7 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Renu Desai: తీవ్ర అనారోగ్యానికి గురైన పవన్ మాజీ భార్య రేణుదేశాయ్..!!

Share

Renu Desai: పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ అందరికీ సుపరిచితురాలే. “బద్రి” సినిమాతో ఇండస్ట్రిలో అడుగు పెట్టిన ఆమె తర్వాత పవన్ దర్శకత్వంలో వచ్చిన “జానీ” సినిమా చేయటం జరిగింది. రెండు సినిమాల తర్వాత పవన్ తో సహజీవనం చేసి పిల్లాడిని కన్న తర్వాత.. పెళ్లి చేసుకోవడం జరిగింది. 2007లో పెళ్లి కాక 2011వ సంవత్సరంలో రేణు విడాకులు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం పిల్లలతో పూణేలో ఉంటున్న రేణు అడపాదడబా హైదరాబాద్ వస్తూ కొన్ని కొన్ని టెలివిజన్ షోలు.. ఇటీవల పాలు సినిమాలలో కీలకపాత్రలు చేస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న తర్వాత చాలా కాలం ఇండస్ట్రీకి హైదరాబాద్ కి దూరంగా ఉండటం జరిగింది.

Pawan ex-wife Renu Desai who fell seriously

కానీ పిల్లలు పెద్దవాళ్లవుతున్న తరుణంలో మెల్లమెల్లగా ఇటీవల కొన్ని సంవత్సరాల నుండి మళ్ళీ హైదరాబాద్ రావడం స్టార్ట్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే తాను అనారోగ్యానికి గురైనట్లు స్వయంగా రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది. విషయంలోకి వెళ్తే గుండె మరియు ఇతర సమస్యలతో బాధపడుతున్నట్లు ఆ పోస్టులో చెప్పుకొచ్చింది. వాటిని ఎదుర్కోవటానికి శక్తిని కూడా పెట్టుకుంటున్నట్లు తెలియజేసింది. ఇలా ఎవరైనా బాధపడుతున్నారంటే… వాళ్లు ఎలాంటి పరిస్థితులలో ఉన్న.. ధైర్యం కోల్పోకుండా జీవితంలో బలంగా నిలబడాలంటే.. తన పోస్టులో రేణు తెలిపింది.

Pawan ex-wife Renu Desai who fell seriously

ఇటీవల ఇండస్ట్రీకి చెందిన చాలామంది సెలబ్రిటీలు వరుస పెట్టి అనారోగ్యాలకు గురవుతున్నారు. హీరోయిన్ సమంత మయోసైటీస్ వ్యాధితో పోరాడుతున్న సంగతి తెలిసిందే. అలాగే సీనియర్ హీరోయిన్ భానుప్రియ సైతం తన భర్త చనిపోయాక అనారోగ్యానికి గురైనట్లు ఏ విషయం గుర్తుండటం లేదని చెప్పుకొచ్చింది. కాగా ఇప్పుడు రేణు దేశాయ్ అనారోగ్యానికి గురికావడం సంచలనంగా మారింది. ప్రస్తుతం రేణు దేశాయ్ .. రవితేజ హీరోగా చేస్తున్న “టైగర్ నాగేశ్వరరావు” సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.


Share

Related posts

అంత గొప్ప హీరోయిన్ అనుష్క కి .. ఇన్ని కష్టాలా .. పాపం కదా !

sekhar

నాని `ద‌స‌రా` ఫ‌స్ట్ సింగిల్ వ‌చ్చేసింది.. ఊర‌మాస్ అంతే!

kavya N

కృతి శెట్టి ఎన్ని కోట్ల‌కు వార‌సురాలో తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది!?

kavya N