కన్నీళ్లు పెట్టుకున్న పాయల్ రాజపుత్.. కారణం ఏంటంటే?

పాయల్ రాజపుత్.. హిందీ సీరియల్స్ లో నటించే ఈ భామ తెలుగులో మొదటి సినిమాతోనే హిట్ కొట్టి టాలీవుడ్ లో నిలిచిపోయింది. మంచి మంచి స్టార్ హీరోల సరసన అవకాశాలు కొట్టేసి తెలుగులో నటిస్తుంది ఈ భామ. అలాంటి ఈ బ్యూటీ ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో కన్నీళ్లు పెట్టుకొని కనిపించింది. దీంతో అది చుసిన అందరు షాక్ కి గురయ్యారు.

 

ఆమె ఎందుకు ఏడ్చింది అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.. ఆమెకు కోవిడ్ టెస్ట్ చేశారు. ఆ సమయంలోనే ఆమె టెస్ట్ చేయించుకునే సమయంలో పానిక్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంది. ఇక ఈ విషయాన్నీ ఆమె తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆమె కరోనా వైరస్ పరీక్షా చేయించుకున్నట్టు.. పరీక్ష చేసే సమయంలో ఆమెకు చాలా భయం వేసిందని, కానీ కరోనా నెగటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నట్టు ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

కాగా ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమా షూటింగ్ లు ప్రారంభించారు. ఒక్కో సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఇప్పటికే నాగ చైతన్య, సాయి పల్లవి లవ్ స్టోరీ సినిమా షూటింగ్ ప్రారంభం అవ్వగా ఇప్పుడు పాయల్ రాజపుత్ కూడా ఒక సినిమా షూటింగ్ లో పాల్గొంది. ఇక ఆ సమయంలోనే ఆమె కరోనా పరీక్షా చేయించుకుంది.