Aacharya: ఏప్రిల్ 23 వ తారీకు హైదరాబాద్ యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్ నందు మెగా అభిమానుల మధ్య “ఆచార్య” ప్రీ రిలీజ్ వేడుక అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఎస్.ఎస్.రాజమౌళి రావడం జరిగింది. ఇదిలా ఉంటే ఈ ప్రీ రిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మేటర్ లోకి వెళ్తే చిరంజీవి.. ప్రసంగిస్తూ ఎస్.ఎస్.రాజమౌళి గొప్పదనం గురించి.. తెలుగు సినిమాస్థాయి పెరగటం గురించి.. అనేక విషయాలు తెలియజేశారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
భారతీయ చలన చిత్ర రంగం యొక్క స్థాయిని ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు రాజమౌళి వల్ల దకటం ఆయన మన తెలుగు వాళ్లు కావటం.. మనం ఎంతో గర్వించదగ్గ విషయమని తెలిపారు. ఇదే సమయంలో రామ్ చరణ్, పూజా హెగ్డే, డైరెక్టర్ కొరటాల ఇంకా సినిమాకి పని చేసిన టెక్నీషియన్స్ అందరి గురించి మాట్లాడటం జరిగింది. ఈ సమయంలో ప్రధాన హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి… చిరంజీవి ఒక ప్రస్తావన కూడా చెప్పకపోవడం పట్లా బయట రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ వేడుకకు వచ్చిన చాలామంది కాజల్ అగర్వాల్ గురించి పెద్దగా మాట్లాడలేదు. పైగా ట్రైలర్ లో కూడా ఆమె కనబడలేదు. ఇటువంటి సమయంలో చిరంజీవి కనీసం.. కాజల్ అగర్వాల్ గురించి మాట్లాడాల్సింది, అదేవిధంగా.. తల్లి అయినందుకు ఆమెను విష్ చేసి ఉంటే వేడుకకు మరింత అందం వచ్చేది అని అంటున్నారు. చాలా వరకు వేదికపై పూజా హెగ్డే గురించి మాట్లాడటం జరిగింది. కాజల్ అగర్వాల్ గురించి ఒకరైన ప్రస్తావించి ఉంటే… ఆమెకు గౌరవం ఇచ్చినట్టు ఉండేదని… ఆచార్య హీరోయిన్ ల విషయంలో పూజా హెగ్డే ని హైలెట్ చేశారని బయట జనాల టాక్.