స్టైల్ ని రీడిఫైన్ చేస్తున్నాడు

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా పెట్టా. పేట పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్ కి, టీజర్ కి తమిళ సినీ ఫ్యాన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. వింటేజ్ రజినీకాంత్ ని గుర్తు చేస్తూ వచ్చిన ఈ టీజర్ కోలీవుడ్ లో కొత్త రికార్డులు సృష్టించింది. ఈ టీజర్ చేసిన మాయ మర్చిపోక ముందే రజిని, ట్రైలర్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు

స్టైల్ ని రీడిఫైన్ చేస్తూ వచ్చిన ఈ ట్రైలర్ లో రజిని లుక్ చాలా బాగుంది, దాదాపు పదేళ్లు ఏజ్ తగ్గినట్లు కనిపిస్తున్న తలైవాని చూసి సినీ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. భాషలో రజినీకాంత్ ని గుర్తు చేస్తూ, ఆయన మార్క్ స్టైల్ అండ్ మ్యానరిజమ్స్ చూపిస్తూ కట్ చేసిన పెట్టా ట్రైలర్, ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్ అనే చెప్పాలి. డైలాగులు, డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ ఇలా ప్రతి ఎలిమెంట్ లో కొత్తగా కనిపించిన రజిని, పొంగల్ కి హిట్ అందుకోవడం ఖాయమనే ఫీలింగ్ ఈ ఒక్క ట్రైలర్ తోనే కలిగించాడు.

తమిళనాట పొంగల్ కానుకగా వస్తున్న పెట్ట సినిమా..తెలుగులో పేటగా మరి సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్, సాంగ్స్ ని రిలీజ్ చేసిన చిత్ర యూనిట్, తెలుగు వెర్షన్ టీజర్ ని కానీ ట్రైలర్ ని కానీ ఇంకా విడుదల చేయలేదు. అయితే ట్రైలర్ చూస్తుంటే మాత్రం, హిట్ ఫ్లాప్ కి సంబంధం లేకుండా ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించే రజినికి, కొంచెం పాజిటివ్ టాక్ తోడైతే సంక్రాంతికి రజినీ రచ్చ చేయడం ఖాయం. మరి ఈ సినిమాతో వింటేజ్ రజినీ ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడు అనేది చూడాలి.