సెక్స్ రాకెట్ నడుపుతున్న నటుడిని అరెస్ట్ చేసి బుల్లితెర నటులను కాపాడిన పోలీసులు!

పెద్ద పెద్ద నగరాలలో అమాయకులైన మహిళను లోబరుచుకుని వ్యాపారం చేస్తూ కోట్లకు పడగలెత్తుతారు. ఇలాంటి సెక్స్ రాకెట్ లను నడపడానికి ఫైవ్ స్టార్ హోటల్ లో ను వేదికగా వాడుకుంటున్నారు. అమాయకులైనటువంటి అమ్మాయిలు కనిపిస్తే వారిని లోబరుచుకుని లక్షలకు డీల్ కుదుర్చుకుని ఇలాంటి వ్యాపారాలకు తెరలేపుతున్నారు. ఈ తరహాలోనే ముంబై ఫైవ్ స్టార్ హోటల్లోఓ సినీ నటుడు సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

ముంబై ఫైవ్ స్టార్ హోటల్ పై నిఘా ఉంచినపోలీసులు ఎట్టకేలకు సెక్స్ రాకెట్ నడుపుతున్న సినీ నటుడిని అరెస్టు చేశారు. అతన్ని అరెస్టు చేయడంతో పాటు ఇందులో చిక్కుకున్న ముగ్గురు బుల్లితెర నటులను పోలీసులు కాపాడారు. ఆ ముగ్గురిలో ఒకరు బెల్లీ డ్యాన్సర్ కూడా ఉన్నారని సమాచారం.

పోలీసులకు అందిన సమాచారం మేరకు కొంత మంది మహిళలతో సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లు సమాచారం అందిందని, దీంతో ఆ సెక్స్ రాకెట్ గుట్టును బయట పెట్టడానికి పోలీసులు ఎంతో ప్రణాళికా బద్దంగా వ్యవహరించారు. అక్కడే ఈ రాకెట్ నడుపుతున్న నిందితులను పట్టుకోవడం కోసం నకిలీ కస్టమర్ ని హోటల్ కి పంపారు. అతడి కోసం ముగ్గురు మహిళలను పంపించేందుకు10.5 లక్షలకు ఆ నటుడు అతనితో డీల్ కుదుర్చుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ విషయం తెలుసుకున్న సీనియర్ పోలీస్ ఆఫీసర్ మహేష్ థావడే నేతృత్వంలో పోలీసుల బృందం ఒక్కసారిగా ఫైవ్ స్టార్ హోటల్ పై దాడి చేశారు. ఎట్టకేలకు సెక్స్ రాకెట్ కు కారణమైన సినీనటుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ సినీ నటుడు పై కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారులు పేర్కొన్నారు. ఈ సెక్స్ రాకెట్ లో ఇరుక్కున్న ముగ్గురు బుల్లితెర నటులను పోలీసులు రక్షించారు.