`సాహో` నిర్మాత‌ల‌పై ఫిర్యాదు


రీసెంట్‌గా విడుద‌లైన ప్ర‌భాస్ చిత్రం `సాహో`. ఈ చిత్ర నిర్మాత‌లు వంశీ, ప్ర‌మోద్‌ల‌పై …బెంగ‌ళూరుకి చెందిన ఔట్‌షైనీ అనే బ్యాగుల త‌యారీ కంపెనీ మాదాపూర్ పోలీసులుకు ఫిర్యాదు చేసింది. వివ‌రాల ప్ర‌కారం `సాహో` సినిమాలో హీరో, హీరోయిన్లు స‌ద‌రు ఔట్‌షైనీ కంపెనీ బ్యాగుల‌ను ఉపయోగించేలా స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తామ‌ని, సినిమా విడుద‌ల స‌మ‌యంలో ప్ర‌చారం క‌ల్పిస్తామ‌ని చెప్పి 1.38 కోట్ల రూపాయ‌లను తీసుకున్నారట‌. గ‌త జూలై 8న ఒప్పందం జ‌రిగింద‌ట‌. తీరా సినిమాలో స‌న్నివేశాలు ఉప‌యోగించ‌లేదు స‌రి క‌దా! సినిమా విడుద‌ల స‌మ‌యంలో ప్ర‌చారం క‌ల్పించ‌లేద‌ట‌. దీంతో స‌ద‌రు కంపెనీ నిర్మాత‌ల‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.