సినిమా

Krack: వివాదాస్పదంగా మారిన రవితేజ “క్రాక్” సినిమా..??

Share

Krack: వరస ఫ్లాపుల్లో ఉన్న రవితేజ 2020లో “క్రాక్” సినిమాతో హిట్ అందుకుని మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కటం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రవితేజ కెరీర్ లోనే రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టింది. ముఖ్యంగా కరోనా లాక్డౌన్ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సినిమా “క్రాక్” సినిమా వ్యాపారానికి డోకా లేదని నిరూపించింది. ఎందుకంటే ఇండియాలో అప్పుడే కరోనా ఎంట్రీ ఇవ్వటంతో వార్తలు చూసిన ప్రజలు ఇంకా సినిమా థియేటర్ లోకి వచ్చే పరిస్థితి ఉండదని అనేక కామెంట్లు వచ్చాయి.

Police Complaint Against Raviteja Krack Movie

ప్రభుత్వాలు ఆంక్షలు విధించడంతో పాటు ప్రజలలో కరోనా భయం రోజు రోజుకి పెరుగుతూ ఉండటం తో.. ఇంకా సినిమా వ్యాపారం అయిపోయినట్లే.. అనే వార్తలు అప్పట్లో బలంగా వినిపిస్తున్న సమయంలో రవితేజ డేర్ అండ్ డాష్ తో…క్రాక్ రిలీజ్ చేసి హిట్టు అందుకున్నాడు. ప్రేక్షకులు థియేటర్ కి ఏమాత్రం భయం లేకుండా రావడంతో..క్రాక్ సినిమా విజయం సాధించడం పట్ల ఇండస్ట్రీలో అప్పుడు చాలా మంది హీరోలు రియాక్ట్ అయ్యారు. ఇదిలా ఉంటే 2020వ సంవత్సరంలో రిలీజ్ అయిన “క్రాక్” ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

పూర్తి విషయంలోకి వెళ్తే..క్రాక్ సినిమా స్టోరీ తనదే అంటూ శివ సుబ్రహ్మణ్య మూర్తి అనే రచయిత జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. బల్లెం సినిమా మీడియా డైరెక్టర్ అనే పుస్తకంలో సన్నివేశాలు ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించినట్లు ఆరోపిస్తున్నాడు. ఈ క్రమంలో ఫిలిం ఛాంబర్ ద్వారా నోటీసులు పంపిన ఎవరూ స్పందించలేదని .. ఫిర్యాదుదారుడు శివ సుబ్రహ్మణ్య మూర్తి తన గోడు వెళ్లబోసుకున్నాడు. మరి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళినా ఈ పంచాయతీ పట్ల “క్రాక్” సినిమా యూనిట్ ఇప్పటికైనా రెస్పాండ్ అవుతుందో లేదో చూడాలి.


Share

Related posts

రెండు మిలియ‌న్ డాల‌ర్లు…

Siva Prasad

KiKi Vijay Red Saree Images

Gallery Desk

నెట్‌ఫ్లిక్స్‌కు క్వీన్ దొరికింది!

Siva Prasad